అనసూయ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే..

అనసూయ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే..

బుల్లితెరపై స్టైలిష్ యాంకర్‌గా మార్క్ క్రియేట్ చేసింది అనసూయ. అప్పటి వరకూ యాంకర్స్ అంటే నిండుగా బట్టలు ధరించి ఉండేవారు. కానీ అనసూయ పొట్టి పొట్టి దుస్తులతో గ్లామర్ షో చేయడమే కాకుండా నయా ట్రెండ్‌కు బీజం వేసింది. జబర్దస్త్ షో వేదికగా అనసూయ సంచనాలకు తెరలేపింది. యాంకర్‌గా టాప్‌లో కొనసాగుతున్న సమయంలోనే నటిగా కూడా అవకాశాలు పట్టేసింది. 

వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ విలక్షణ నటిగా అనసూయ పేరు తెచ్చుకుంది. రంగస్థలం సినిమాతో అనసూయ దశ తిరిగింది. అవకాశాలు ఆమెను వెదుక్కుంటూ వస్తున్నాయి. బుల్లితెరకు గుడ్ బై చెప్పేసి పూర్తి స్థాయి నటిగా కొనసాగుతోంది. అయితే యాంకర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించక మునుపే అనసూయ వెండితెరపై అవకాశాల కోసం ప్రయత్నాలు సాగించింది. 2003 లో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన పొలిటికల్ థ్రిల్లర్ నాగలో తొలిసారిగా అనసూయ కనిపించింది.

నాగ చిత్రంలో కాలేజీ స్టూడెంట్‌గా అనసూయ నటించింది. కానీ ఆ సినిమాలో ఆమెను గుర్తించడం చాలా కష్టం. జస్ట్ కొన్ని సెకండ్స్ కనిపిస్తుంది. ఆ సినిమా చేస్తున్నప్పుడు అనసూయ వయసు 19 ఏళ్లట. ఈ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్‌గా నటించినందుకు గానూ.. రూ.500 రెమ్యూనరేషన్ ఇచ్చారట. అదే ఆమె తొలి సంపాదనట. అలాంటి అనసూయ రేంజే ఇప్పుడు మారిపోయింది. గత ఏడాదైతే ఏకంగా అరడజనుకు పైగా సినిమాలు చేసింది.

Google News