బాలీవుడ్‌లో భారీ ఆఫర్ పట్టేసిన రష్మిక..

బాలీవుడ్‌లో భారీ ఆఫర్ పట్టేసిన రష్మిక..

యానిమల్ మూవీతో బాలీవుడ్‌లో జెండా పాతింది రష్మిక మందన్న. ఈ చిత్రం ఎంత పెద్ద సక్సస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం రష్మికకు బాలీవుడ్‌లో భారీ క్రేజ్‌ను తెచ్చి పెట్టింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ ఏకంగా రూ. 900 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం ఇంత పెద్ద హిట్ కావడంతో అమ్మడికి బాగా కలిసొచ్చింది. రష్మికకు బాలీవుడ్ లో ఆఫర్లు క్యూ కడుతున్నాయి. 

తాజాగా నేషనల్ క్రష్.. ఓ క్రేజీ ఆఫర్ పట్టేసింది. బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకరైన హీరో సల్మాన్ ఖాన్ నెక్స్ట్ సినిమాలో అవకాశం కొట్టేసింది. తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్, సల్మాన్ కాంబోలో రూపొందనున్న చిత్రంలో హీరోయిన్‌గా రష్మిక ఎంపికైంది. ఈ చిత్రం ‘ సికందర్ ‘ అనే టైటిల్‌తో భారీ బడ్జెట్ మూవీగా రూపొందనుంది. ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ స్నేహితుడు సాజిద్ నడియావాలా నిర్మిస్తున్నారు.

ఇక చిత్రం వచ్చే నెలలో పట్టాలెక్కనుంది. ప్రస్తుతం రష్మిక అయితే చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉంది. పుష్ప 2 చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. పుష్ప 2 ఆగస్టు 15న విడుదల కానుంది.  తమిళ స్టార్ హీరో ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘ కుబేర’  సినిమాలో సైతం రష్మిక నటిస్తోంది.

Google News