శృతి చేసిన పనికి నెటిజన్లు ఏం చేశారంటే..

శృతి చేసిన పనికి నెటిజన్లు ఏం చేశారంటే..

ఇటీవల ఎక్కువగా వార్తల్లో ఉండే నిలిచిన హీరోయిన్ శృతిహాసన్‌. ఈ ముద్దుగుమ్మ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది. స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన ఆమె.. ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్‌ చేసుకున్నట్లు వార్తలు వైరలయ్యాయి. బాయ్ ఫ్రెండ్, బ్రేకప్ వంటి విషయాలు శృతికి కొత్తేమీ కాదు.  అయితే ఈ విషయంపై శృతిహాసన్‌ ఇప్పటి వరకూ స్పందించలేదు. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి వార్తల్లో నిలిచింది.

శృతిహాసన్ చేసిన పని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఆమె చేసిన పనికి నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే.. ప్రస్తుతం శృతి హాసన్ ము  అసలు విషయానికొస్తే శృతి హాసన్‌ ప్రస్తుతం ముంబాయిలో ఉంటున్నారు. అక్కడే ఓ మూవీ షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. దీనికోసం షూటింగ్ స్పాట్‌కు శృతి బయలు దేరింది కానీ మార్గమధ్యంలోఆమె ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయింది.  

ఎంతసేపటికీ ట్రాఫిక్ క్లియర్‌ కాలేదు. దీంతో షూటింగ్‌కు ఆలస్యం అవుతుందని శృతిహాసన్‌ తాను వెళుతున్న కారును పక్కన నిలిపేసి ఆటో ఎక్కి వెళ్లిపోయింది. ఆమె ఆటోలో వెళుతున్న  వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు వృత్తి ధర్మానికి ఆమె ఇచ్చిన ప్రయారిటీపై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు.  గతంలో బిగ్‌బీ అబితాబ్ బచ్చన్ కూడా ఇలాగే చేశారు. ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో కారు దిగి వేరే వ్యక్తి బైక్‌లో షూటింగ్‌ స్పాట్‌కు వెళ్లారు.