నాడు వద్దు.. నేడు పవనే ముద్దు.. ఇదెలా ఐకాన్ స్టార్!

నాడు వద్దు.. నేడు పవనే ముద్దు.. ఇదెలా ఐకాన్ స్టార్!

ఒకప్పుడు ‘తగ్గను బ్రదర్.. తగ్గేదేలే’ అని టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పవన్ కల్యాణ్ గురించి ఎంత హడావుడి చేశాడో గుర్తుంది కదా. అబ్బో అప్పట్లో అటు రాజకీయాల్లో.. ఇటు సినీ ఇండస్ట్రీలో ఈ స్టార్ హీరో వ్యవహారం ఏ రేంజిలో బర్నింగ్ టాపిక్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సీన్ కట్ చేస్తే.. సరిగ్గా ఎన్నికల ముందు పవన్-అల్లు అర్జున్ ఒక్కటయ్యారు. అంతేకాదు.. నాడు తగ్గను బ్రదర్ అన్న అల్లు అర్జున్.. నేడు పూర్తిగా తగ్గిపోయి ‘తగ్గిపోయాను బ్రదర్’ అన్నట్లుగా ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ఇంతకీ ఏం జరిగింది..? ఎన్నికల ముందు ఎందుకింత హడావుడి అనే విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి మరి.

నాడు వద్దు.. నేడు పవనే ముద్దు.. ఇదెలా ఐకాన్ స్టార్!

అంతా పవన్మాయ!

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు రోజురోజుకూ ఇండస్ట్రీ నుంచి మద్దతు అయితే పెరుగుతోంది. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ గెలవాలని ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో పలువురు చిత్ర ప్రముఖులు మద్దతు తెలియజేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సైతం ఆయనకు మద్దతు తెలియజేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. ఇక ఇండస్ట్రీ నుంచి పవన్‌కు వస్తున్న మద్దతు అంతా ఇంతా కాదు.! ఇక జబర్దస్త్ నుంచి కమెడియన్స్ చాలా మంది రంగంలోకి దిగారు. అదిరే అభి, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, కిరాక్ ఆర్పీ వంటి వారంతా ఏపీలో పవన్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం పవన్ కోసం రంగంలోకి దిగాడు. ‘తగ్గను బ్రదర్’ అంటూ నాడు పవన్ విషయంలో మాట్లాడి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న పవన్ ఎన్నికల వేళ తగ్గారు. సోషల్ మీడియా వేదికగా పవన్ విజయాన్ని కాంక్షిస్తూ పోస్ట్ పెట్టాడు.

నాడు వద్దు.. నేడు పవనే ముద్దు.. ఇదెలా ఐకాన్ స్టార్!

నాడు.. నేడు..!

ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్‌కి అల్లు అర్జున్ సంపూర్ణ మద్దతు ప్రకటించాడు. ‘‘ఈ ఎన్నికల ప్రయాణంలో పవన్ కల్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ జీవితాన్ని సేవకే అంకితం చేస్తూ మీరు ఎంచుకున్న మార్గాన్ని చూసి నేను ఎప్పుడూ గర్వపడుతూ ఉంటాను. కుటుంబ సభ్యునిగా, నా ప్రేమ, మద్దతు మీకు ఎప్పుడూ ఉంటుంది. మీరు ఆశించినది సాధించినందుకు నా శుభాకాంక్షలు’’ అని అల్లు అర్జున్ పోస్ట్ పెట్టారు. దీనికి ఓ రేంజిలో కౌంటర్లు పేలుతున్నాయి. నాడు వద్దన్నావ్.. నేడు ముద్దు అంటున్నావ్ ఇదేంటబ్బా ఇది.. ఎంతైనా మీరు మీరు ఒకటేనా మధ్యలో పిచ్చోళ్లు అయ్యింది మేమేనా అంటూ ఐకాన్ స్టార్ అభిమానులు ఒకింత నిట్టూరుస్తున్నారు. వాస్తవానికి అల్లు అర్జున్ అభిమానులు.. మెగాభిమానుల మధ్య ఎన్నోరోజులుగా వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. చూశారుగా ఇదన్న మాట సంగతి!.