తన భార్య ఎదుర్కొన్న దారుణ అవమానాన్ని వివరించిన యాంకర్ రవి..

తన భార్య ఎదుర్కొన్న దారుణ అవమానాన్ని వివరించిన యాంకర్ రవి..

టాలీవుడ్ టాప్ మేల్ యాంకర్స్‌లో రవి ఒకడు. రవి చేసిన షోస్ అన్నీ మంచి సక్సెస్ సాధిస్తూ ఉంటాయి. అప్పట్లో రవి కెరీర్‌కు బ్రేక్ పడింది. ఆ తరువాత బిగ్‌బాస్ షోలో రవి బాగా ఆకకట్టుకున్నాడు. అక్కడి నుంచి తిరిగి కెరీర్ ఊపందుకుంది. అయితే రవి తన కెరీర్‌లో పర్సనల్‌గానూ, ప్రొఫెషనల్‌గానూ చాలా విమర్శలు ఎదర్కొన్నాడు. ముఖ్యంగా అప్పట్లో యాంకర్ లాస్య – యాంకర్ రవి మధ్య లవ్ ఎఫైర్ నడుస్తుందని అనేక పుకార్లు షికారు చేశాయి. 

ఈ పుకార్ల కారణంగా రవి పర్సనల్ లైఫ్ కూడా ఇబ్బందుల్లో పడిందట. ఇక ఇప్పుడైతే ఆ జంట చాలా సంతోషంగా జీవిస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో రవి తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఓ పరాభవాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. రీతూ చౌదరి హోస్ట్ చేస్తున్న దావత్ షోలో రవి పాల్గొన్నాడు. ఈ షోలో రవి తన కెరీర్, పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన చాలా విషయాలను వివరించాడు.

తన భార్య ఎదుర్కొన్న దారుణ అవమానాన్ని వివరించిన యాంకర్ రవి..

తను పక్కా 100 శాతం కమర్షియల్ అని.. తనకు వచ్చిన పని చేసుకుంటూ డబ్బు తీసుకుంటానని రీతూ ప్రశ్నకు సమాధానంగా రవి చెప్పాడు. ఈ సమయంలోనే లాస్యతో ఎఫైర్ రూమర్స్ వస్తున్న క్రమంలో.. తన భార్యకు జరిగిన సంఘటన గురించి రవి బయటపెట్టాడు. తన భార్యతో కలిసి ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌కు వెళ్లానని.. అక్కడ తన భార్యను ‘రవి భార్య ఆ యాంకర్ కదా.. నువ్వేంటి నా భర్త అని చెప్పుకుని తిరుగుతున్నావ్?’ అని అడిగారట. దీంతో రవి భార్య చాలా ఏడ్చిందట. ఈ రూమర్స్ వల్ల తాము చాలా ఇబ్బందులు పడ్డామని తెలిపారు.