‘ఛీ.. నీ బతుకు’ అంటూ నెటిజన్ కామెంట్.. కలర్స్‌ స్వాతి రియాక్షన్ ఇదీ

‘ఛీ.. నీ బతుకు’ అంటూ నెటిజన్ కామెంట్.. కలర్స్‌ స్వాతి రియాక్షన్ ఇదీ

కలర్స్ స్వాతి.. బుల్లితెరపై తన కెరీర్‌ను ప్రారంభించి.. ఆపై వెండితెరపై నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. యూత్ అయితే స్వాతిని అసలు మరచిపోలేరు. కలర్స్ అనే ప్రోగ్రాం ద్వారా మంచి నేమ్, ఫేమ్ సంపాదించుకుని కలర్స్ స్వాతిగా స్థిరపడిపోయింది. ఆ తరువాత డేంజర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఆ తరువాత ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో పూజ పాత్రతో మెరిసింది. 

పూజ పాత్రకు అయితే విపరీతమైన గుర్తింపు వచ్చింది. అష్టా చమ్మా మూవీతో హీరోయిన్‌గా మారింది. ఈ సినిమా కలర్స్ స్వాతికి మంచి టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఆ తరువాత పలు సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు వచ్చాయి కానీ ఆశించిన స్థాయి ఫలితాన్ని అయితే ఇవ్వలేదు. ఆ తరువాత వివాహం చేసుకుని టాలీవుడ్‌కి దూరమైంది. ఇటీవలే తిరిగి ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చింది. గతేడాది మంత్‌ ఆఫ్‌ మధు సినిమాతో పలకరించింది. 

అయితే కలర్స్ స్వాతి సోషల్‌ మీడియాకు కాస్త దూరంగానే ఉంటుంది.  తాజాగా ఆమె తన కుటుంబసభ్యులను పరిచయం చేస్తూ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసింది. ఇది చూసిన ఓ నెటిజన్‌.. ‘ఛీ నీ బతుకు..’ అని కామెంట్‌ చేశాడు. దీనిపై ఫైర్ అవకుండా కలర్స్ స్వాతి చాలా డీసెంట్‌గా బిహేవ్ చేసింది. నెటిజన్ కామెంట్‌ స్క్రీన్‌షాట్‌ను షేర్‌ చేసి.. తనకు కూడా అప్పుడప్పుడు అలాగే అనిపిస్తుంటుందని చెప్పింది. వెంటనే ముందుకు వెళ్లాలని అనుకుంటూ ఉంటుందట. తన కామెంట్‌కు నో దిష్టి అనే సింబల్‌ను జత చేసింది.