సూర్య, చెర్రీ మల్టీస్టారర్ నిజమేనా.. డైరెక్టర్ కూడా ఫిక్సేనా!

సూర్య, చెర్రీ మల్టీస్టారర్ నిజమేనా.. డైరెక్టర్ కూడా ఫిక్సేనా!

పాన్ ఇండియా సినిమాల్లో భాగంగా కొన్ని మల్టీ స్టారర్ సినిమాలు రూపొందుతున్నాయి. ఇలా రూపొంది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఇది ఏకంగా ఆస్కార్ అవార్డును కొట్టింది. ఇక ఇప్పుడు మరో మల్టీ స్టారర్ పాన్ ఇండియా మూవీ కూడా సిద్ధమవుతోందని టాక్. ఆ స్టార్ హీరో జంట ఎవరో తెలిస్తే షాకవుతారు. ఈ సినిమా సక్సెస్ గురించి ముందే ఫిక్స్ అవుతారు. ఆ ఇద్దరూ మరెవరో కాదు.. రామ్ చరణ్, కోలీవుడ్ స్టార్ సూర్య.

రామ్ చరణ్, సూర్య కలిసి ఓ మల్టీస్టారర్ మూవీలో నటించబోతున్నారని టాక్ నడుస్తోంది. చాలా రోజుల నుంచి వినిపిస్తున్న వార్తే అయినా డైరెక్టర్ కూడా ఫిక్స్ అయినట్టు వార్తలు రావడంతో అంతా నిజమేనని నమ్ముతున్నారు. ఈ సినిమాకు ప్రస్తుతం సూర్య తో కంగువ అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్న శివ దర్శకత్వం వహించబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. డైరెక్టర్ కూడా ఎవరో తెలిసింది కాబట్టి ఈ వార్తలు నిజమేనని అంతా ఫిక్స్ అవుతున్నారు.

అయితే ఇప్పటి వరకూ ఈ వార్తలపై అటు రామ్ చరణ్ కానీ.. ఇటు సూర్య కానీ స్పందించింది అయితే లేదు. దీంతో దీనిలో నిజమెంతనే అనుమానాలూ లేకపోలేదు. ఇక సూర్య నటించిన కంగువ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రూపొందింది. రామ్ చరణ్ ఇప్పుడు గేమ్ చేంజర్‌తో పాటు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో నటిస్తున్నాడు. వీరిద్దరూ తమ సినిమాల్లో బిజీగా ఉన్నారు. దీంతో మల్టీ స్టారర్ నిజమేనా? అన్న టాక్ కూడా నడుస్తోంది.