ఆ స్టార్ హీరో జంట విడిపోనుందా? షాక్ అవుతున్న ఇండస్ట్రీ..

ఆ స్టార్ హీరో జంట విడిపోనుందా? షాక్ అవుతున్న ఇండస్ట్రీ..

ఇండస్ట్రీలో మరో స్టారో హీరో, హీరోయిన్ జంట విడాకులు తీసుకుబోతున్నారని టాక్ నడుస్తోంది. ఇండస్ట్రీలో విడాకులేం కొత్త కాదు కానీ మంచిగా ఉన్న జంటను సైతం సోషల్ మీడియా విడదీస్తూ ఉంటుంది. ఇంతకీ ఆ జంట ఎవరంటారా? రణ్‌వీర్ సింగ్ – దీపికా పదుకొణె జంట. వీరిద్దరూ 2018లో వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. అయితే పెళ్లై ఏళ్లు గడుస్తున్నా దీపికా గర్భం దాల్చలేదు. దీంతో పుకార్లు ప్రారంభమయ్యాయి.

దీపిక – రణ్‌వీర్‌ల మధ్య ఫిజికల్ రిలేషన్ లేదని అందుకే ఆమె ఇప్పటి వరకూ గర్భం దాల్చలేదని పుకార్లు వస్తున్నాయి. ఇప్పుడే కాదు.. ఈ ఏడాది ప్రారంభంలోనూ వీరిద్దరి విడాకుల వార్తలు వినిపించాయి. ఆ తరుణంలోనే ఈ ఏడాది ఫిబ్రవరిలో తాను గర్భం దాల్చానంటూ దీపిక తెలిపింది. సెప్టెంబర్‌లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు చెప్పడంతో ఈ వార్తలకు చెక్ పడింది. ఈ తరుణంలోనే ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.

Ranveer, Deepika Padukone

రణ్‌వీర్ తన ఇన్‌స్టా అకౌంట్ నుంచి పెళ్లి ఫోటోలన్నీ డిలీట్ చేశాడు. దీంతో వీరిద్దరి విడాకుల వార్తలు తిరిగి ప్రారంభమయ్యాయి. అటు బాలీవుడ్‌లోనూ దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలోనూ కొందరు సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడానికి ముందు ఇలాంటి హింట్సే ఇచ్చారు. సమంత, నాగ చైతన్యలు, ధనుష్ జంట, నిహారిక కొణిదెల జంట విడాకులకు ముందు సోషల్ మీడియా నుంచి ఫోటోలను డిలీట్ చేశారు. మరి ఇప్పుడు దీపిక, రణ్‌వీర్ విషయంలో ఇది ఎంతవరకూ నిజమవుతుందో చూడాలి.

Google News