ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ ఓ సామ్రాజ్యాన్నే సృష్టించబోతున్నారట..

ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ ఓ సామ్రాజ్యాన్నే సృష్టించబోతున్నారట..

పాన్ ఇండియాలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్స్‌లో ఒకరైన ప్రశాంత్ నీల్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో సినిమా రానున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ప్రశాంత్ నీల్ సన్నాహాలు అయితే చేస్తున్నాడు. మరోవైపు ప్రభాస్‌లో సలార్ 2 కూడా చేయాల్సి ఉంది. ఏ సినిమా ముందుగా సెట్స్‌ మీదకు వెళుతుందనేది తెలియలేదు. అయితే ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమాకు మాత్రం ప్రశాంత్ నీల్ ఒక పోస్టర్‌ను సైతం రిలీజ్ చేశారు. 

పోస్టర్‌ను బట్టి చూస్తే ఈ సినిమా కూడా డార్క్ మోడ్ లోనే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ ఇప్పటి వరకూ చేసిన సినిమాలన్నీ డార్క్ మోడ్‌లో రూపొందించినవే. సలార్ సినిమా కోసం ఏకంగా ‘ఖాన్సార్‘ అనే ఒక రాజ్యాన్ని సృష్టించాడు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా కోసం ఏం సృష్టించబోతున్నారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ శాతవాహనుల కాలం నాటి స్టోరీని ఎంచుకున్నట్టు టాక్ నడుస్తోంది.

ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ ఓ సామ్రాజ్యాన్నే సృష్టించబోతున్నారట..

ప్రశాంత్ నీల్ అంటేనే ఫిక్షనల్ స్టోరీ.. అలాంటిది ఈ సినిమా మాత్రం వేరే జోనర్ ఎందుకుంటుంది? ఇది కూడా ఫిక్షనల్ స్టోరీ అని తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకూ ప్రశాంత్ నీల్ చేసిన సినిమాలన్నింటిలో సెట్సే హైలైట్ అవుతుంటాయి. ఈ సినిమా కోసం కూడా భారీ సెట్ వేయబోతున్నారని టాక్.  ప్రస్తుతం ప్రశాంత్ పూర్తిగా ఎన్టీఆర్ స్క్రిప్ట్ మీదనే  ఫోకస్ పెట్టారని టాక్. శాతవాహనుల కాలం నాటి రోజులను క్రియేట్ చేయాలంటే బడ్జెట్ కూడా భీభత్సంగానే ఉంటుంది కాబట్టి ఈ సినిమా కోసం దాదాపు 500 కోట్ల పైన అవుతుందని టాక్.