కెరీర్ బాగుండాలంటే కోరిక తీర్చాల్సిందే: కుండబద్దలు కొట్టిన రమ్యకృష్ణ

కెరీర్ బాగుండాలంటే కోరిక తీర్చాల్సిందే: కుండబద్దలు కొట్టిన రమ్యకృష్ణ

సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందనేది ఓపెన్ సీక్రెటే. ఎప్పటి నుంచో చాలా మంది నటీమణులు ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే స్టార్ హీరోయిన్ల నోట నుంచి మాత్రం దీనికి సంబంధించిన మాటలు బయటకు రావు. పెద్దగా ఎవరూ పెదవి విప్పరు. తాజాగా క్యాస్టింగ్ కౌచ్‌పై సీనియర్ నటి రమ్యకృష్ణ సంచలన విషయాలు బయటపెట్టింది. ఏ రంగంలోనైనా ఎదగాలంటే కొన్ని చోట్ల లొంగకు తప్పదని స్పష్టం చేసింది.

ఇతరుల కోరికలు తీరిస్తేనే ముఖ్యంగా మహిళలు తమ ఉనికి చాటుకోగలుగుతారని.. లేదంటే కష్టమని రమ్యకృష్ణ ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా రమ్యకృష్ణ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇండస్ట్రీలో స్టార్ నటిగా ఎదగాలంటూ దర్శకనిర్మాతలు, హీరోల కోరిక తీర్చాల్సిందేనని స్పష్టం చేశారు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మహిళలు నిలదొక్కుకోవాలంటే పక్కాగా పడక గదిలోకి వెళ్లాల్సిందేనని తెలిపారు.

అయితే అందరూ అలాగే ఉంటారని చెప్పనని.. కానీ ఎక్కడో ఒక దగ్గర మాత్రం పక్కాగా కాంప్రమైజ్ కావాల్సిందేనని రమ్యకృష్ణ తెలిపారు. కొన్నిసార్లు సర్దుకు పోతేనే మంచి భవిష్యత్తు ఉంటుందని వెల్లడించారు. అలా చేయలేదంటే కెరీర్‌కు అంతటితో ఫుల్ స్టాప్ పడుతుందని రమ్యకృష్ణ తెలిపారు. దానిలో ఎలాంటి సందేహమూ లేదని.. అలా కాంప్రమైజ్ కాకపోవడంతో కెరీర్ క్లోజ్ అయిన ఘటనలు కూడా చాలానే ఉన్నాయని వెల్లడించారు.

Google News