రామ్ చరణ్‌కు ఆ హీరోతో పోలికేంటి? అసలెలా?

రామ్ చరణ్‌కు ఆ హీరోతో పోలికేంటి? అసలెలా?

ఇండస్ట్రీలో సక్సెస్ అయితే తప్ప గుర్తింపు రాదు. స్టార్ హీరో కొడుకైనా.. సామాన్యుడి కొడుకైనా అక్కడ ఒక్కటే. స్టార్ హీరో కొడుకైతే అవకాశాలు వస్తాయేమో కానీ నిలబెట్టుకోవాల్సింది మాత్రం వాళ్లే. కష్టపడాల్సింది వాళ్లే. మెగా సామ్రాజ్యాన్ని నిర్మించిన మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ సైతం మొదట్లో విమర్శలు అందుకున్నాడు. ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నాడు. దీనికోసం అతని కష్టం అంతా ఇంతా కాదు.

ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చరణ్ ప్రతిభ ఇంటర్నేషనల్ స్థాయికి చేరింది. కొడితే కుంభ స్థలాన్నే కొట్టాలంటారు. అలా ఒక్క దెబ్బకు ఎక్కడికో వెళ్లి కూర్చొన్నాడు. ఇప్పుడు చెర్రీకి బాలీవుడ్ హీరో ఎవరు సరిపోతారనే చర్చ సర్వత్రా ప్రారంభమైంది. దీనికి అంతా చెబుతున్న పేరు రణ్‌బీర్ కపూర్. ప్రస్తుతం రామాయణం సినిమా చేస్తున్నాడు. మరి అతనే ఎందుకంటారా? వీరిద్దరూ చాలా కష్టపడి పైకి వచ్చినవారే. 

రామ్ చరణ్, రణ్‌బీర్‌ల స్ట్రాటజీస్ వేరైనా కూడా సబ్జెక్ట్‌ను ఎంచుకునే విధానం మాత్రం ఒకేలా ఉంటుందని అంటారు. తద్వారా ఇద్దరూ మంచి సక్సెస్‌లను అందుకుంటూ ఉంటారు. ఇలా ఏవేవో కారణాలు చెప్పి రణ్‌బీర్‌తో చెర్రీ రేంజ్ సమానమని ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. అయితే రణ్‌బీర్ కపూర్, రామ్ చరణ్ ఇద్దరూ ఎవరి ఇండస్ట్రీలో వారు.. అలాగే ప్యాన్ ఇండియాలో స్టార్ హీరోలే.  అయితే వీరిద్దరి మధ్య పోలికేంటి? అసలు అలాంటిదేం లేదు అనేవారు కూడా లేకపోలేదు.

Google News