దుమ్ము రేపిన కల్కి ప్రి రిలీజ్ బిజినెస్.. బడ్జెట్‌ని మించి వసూల్..!

దుమ్ము రేపిన కల్కి ప్రి రిలీజ్ బిజినెస్.. బడ్జెట్‌ని మించి వసూల్..! 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో రూపొందుతున్న చిత్రం కల్కి. ఈ చిత్రం విడుదలకు ముందే రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. గత ఏడాది ఎండింగ్‌లో సలార్ మూవీతో వచ్చిన ప్రభాస్ ఆ ఏడాది మొత్తాన్ని తన ఖాతాలోనే వేసుకున్నాడు. ఇక ఈ ఏడాది కూడా ప్రభాస్ ఖాతాలో పడిపోవడం ఖాయమనే టాక్ నడుస్తోంది. సలార్ మూవీ రూ.900 కోట్లు రాబట్టింది. ఇప్పుడు కల్కి ఎన్ని కోట్లు రాబడుతుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరుపుకుంటుందనే టాక్ నడుస్తోంది. సినిమా బడ్జెట్‌ను మించి ప్రి రిలీజ్ కల్కి సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ చేసినట్టు టాక్ నడుస్తోంది. ఈ సినిమాను నాగ్ అశ్విన్ రూ.600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ రూ.700 కోట్లు బిజినెస్ చేసినట్టు టాక్. అంటే ఇప్పటికే రూ.100 కోట్లు లాభం రాబట్టేసిందన్నమాట. 

ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ చూసి బాలీవుడ్ హీరోలు సైతం షాక్ అవుతున్నారు. దీనికి కారణం సినిమా విడుదలకు ముందే లాభాల్లోకి వెళ్లిపోవడం. ఈ సినిమాతో నాగ్ అశ్విన్ వండర్స్ క్రియేట్ చేయబోతున్నారని టాక్. సైన్స్ ఫిక్షన్ సినిమాగా ఇది రూపొందింది. ప్రభాస్ ఇప్పటి వరకూ టచ్ చేయని జోనర్ ఇది. దీంతో సినిమాపై అంచనాలు బీభత్సంగా పెరిగాయి. ఇక ఇప్పుడీ ప్రి రిలీజ్ బిజినెస్‌తో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అని నమ్ముతున్నారు.