ఏపీలో ఎవరెవరు ఎక్కడ ఓటు వేశారు? పోలింగ్ శాతమెంతంటే..

ఏపీలో ఎవరెవరు ఎక్కడ ఓటు వేశారు? పోలింగ్ శాతమెంతంటే..

ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి రెడ్డిలు కడప జిల్లా పులివెందుల బాకరాపురంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఉండవల్లిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన సతీమణి అన్నా లెజెనోవా మంగళగిరిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, ఆయన సతీమణి బ్రాహ్మణి మంగళగిరిలో ఓటు వేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ షర్మిల, ఆమె భర్త అనిల్ కుమార్ కడపలో ఓటు వేశారు.

ఏపీలో ఎవరెవరు ఎక్కడ ఓటు వేశారు? పోలింగ్ శాతమెంతంటే..

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా.. సాయంత్రం 5 గంటల వరకు 67.99 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి ఎన్నికల్లో మహిళలు చురుకుగా పోలింగ్‌లో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4.13 కోట్లకు పైగా ఓటర్లు ఉండగా.. 2.71 కోట్లకు పైగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో పురుషులు 1.30 కోట్లు అంలే 64.28 శాతం మందికి పైగా ఉండగా.. మహిళలు 1.40 కోట్లకు పైగా 66.84% మంది ఉన్నారు.

ఏపీలో ఎవరెవరు ఎక్కడ ఓటు వేశారు? పోలింగ్ శాతమెంతంటే..

ఏపీ మొత్తం కొన్ని చెదురు మొదురు ఘటనలు మినహా ఎన్నిక మొత్తం ప్రశాంతంగానే కొనసాగింది. కొన్ని చోట్ల మాత్రం టీడీపీ వర్సెస్ వైసీపీ వార్ నడిచింది. ఇరు పార్టీలు కొట్లాటకు దిగాయి. పల్నాడులో మొత్తంగా 12 చోట్ల ఘర్షణలు జరిగినట్టు ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఒకచోట ఈవీఎంను సైతం ధ్వంసం చేశారు. అయితే చిప్ భద్రంగా ఉండటంతో ఈవీఎంలను మార్చి తిరిగి పోలింగ్ ప్రారంభించినట్టు మీనా తెలిపారు. ఎక్కడా రీ పోలింగ్ అవసరమైతే పడలేదన్నారు. కొన్ని చోట్ల ఘర్షణలు జరిగినా కట్టడి చేశామని ముకేష్ కుమార్ మీనా వెల్లడించారు.

Google News