నాగబాబు ఆరోపణలకు గట్టిగా ఇచ్చిపడేసిన ఎన్నికల కమిషన్!
జనసేన, టీడీపీ నేతలు ఏది పడితే అది.. ఎలా పడితే అలా ప్రచారం చేస్తున్నారు. దీని కారణంగా జనాల్లో విపరీతమైన కన్ఫ్యూజన్ వచ్చేస్తోంది. తాజాగా జనసేన పార్టీ కీలక నేత నాగబాబు ఓ సంచలన ఆరోపణ చేశారు. దీనిపై ఎలక్షన్ కమిషన్ ఫైర్ అయ్యింది. పిఠాపురంలో డబ్బులిచ్చి ఓటింగ్ వెళ్లకుండా.. ఇంక్ పూస్తున్నారని నాగబాబు ఆరోపించారు. ఆయన సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏదో ఒక రకంగా వైసీపీపై ఆరోపణలు చేసి తమవైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి పనికి మాలిన విమర్శలు గుప్పిస్తున్నారు.
సిరా బయట దొరకదు..
తాజాగా దీనిపై ఈసీ రియాక్ట్ అయ్యింది. పోలింగ్‌లో అత్యంత కీలకమైనది సిరా గుర్తు. ఓటు వేయడానికి వెళ్లిన వారికి ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు ఈ గుర్తు వేస్తారు. ఇది వేలికి వెంటనే చెరగదు. తద్వారా దొంగ ఓట్లకు అడ్డుకట్ట వేస్తుంటారు. అయితే ఈ సిరా బయట దొరకదు. కానీ నాగబాబు డబ్బులిచ్చేసి జనసేన
సానుభూతిపరులను ఓటింగ్‌కు వెళ్లనివ్వకుండా ఈ సిరా పూస్తున్నారని ఆరోపించారు. దీనిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పందించారు.
ఆ ప్రచారంలో నిజం లేదు..
చెరగని సిరా ఇతరులకు అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారమని కొట్టిపడేశారు. ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై మార్కు చేస్తే కఠిన చర్యలు తప్పవని సైతం హెచ్చరించారు. చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు హక్కును వినియోగించుకోకుండా చూడాలనే కుట్ర రాష్ట్రంలో జరుగుతోందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఈ చెరగని సిరాను కేంద్ర ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తోందని.. ఇది కేవలం భారత ఎన్నికల సంఘం వద్ద తప్ప మరెవరికీ ఇది అందుబాటులో ఉండదని మీనా స్పష్టం చేశారు.