చంద్రబాబు ఆడియో వైరల్ .. పథకాల్లేవ్.. ఏం లేవ్.. అయిపాయ్!!

చంద్రబాబు ఆడియో వైరల్ .. పథకాల్లేవ్.. ఏం లేవ్.. అయిపాయ్!!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి సంబంధించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటి వరకూ పథకాలన్నీ కొనసాగిస్తాం.. పైగా కొత్త పథకాలేవో ప్రకటించేసి వాటన్నింటినీ అమలు చేస్తామన్న చంద్రబాబు అసలు రంగు ఆ ఆడియో ద్వారా బట్టబయలైంది. ఆ ఆడియో విన్న జనాలంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఎన్నికలకు కేవలం కొద్ది గంటల ముందు ఈ ఆడియో బయటకు రావడం ఆ పార్టీకి చాలా పెద్ద మైనస్. 

ఊహించని రీతిలో.. !

ఇంతకీ అసలు ఆ ఆడియోలో ఏముందంటారా? చంద్రబాబు తమ పార్టీ నేతలతో మీటింగ్ నిర్వహించారు. రెండు వారాల్లో పోలింగ్ ఉందని.. పక్కాగా టీడీపీ అధికారంలోకి వస్తుందని.. రెండు వారాల్లో పోలింగ్ ఉంది. ఎలక్షన్ ఎలాగైనా గెలుస్తామని చెప్పారు. అంతటితో ఆగితే బాగానే ఉండేది. కానీ.. ‘‘ఏం చేసైనా ఎన్నికల్లో గెలుస్తాం. గవర్నమెంటును ఫాం చేస్తాం. పథకాల్లేవ్ ఏమీ లేవ్.. అమరావతిని డెవలప్ చేస్తాం.. నువ్వు ఇమాజిన్ చేయలేనంత రిటర్న్స్ ఉంటాయి’’ అని చంద్రబాబు ఎవరికో చెబుతున్నారు. వారి ఆస్తులనుపెంచుకోవడానికి తప్ప.. జనాలకు మేలు చేసేదేమీ లేదని చంద్రబాబే ఒప్పుకుంటున్నారన్న మాట.

మా ఆస్తులన్నీ అమరావతిలోనే..!

పథకాలు ఇస్తానని నిన్నటి వరకూ జరిగిన ప్రచారంలోనూ సభల్లోనూ ఊదరగొట్టి పైగా.. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని.. ఏడాదికి మూడు సిలిండర్లు అని.. నిరుద్యోగ భృతి అని ఎన్నో కబుర్లు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు పథకాల్లేవ్.. ఏం లేవ్.. కేవలం అమరావతి డెవలప్‌మెంటే మా అజెండా అనడమేంటి? అని నివ్వెరబోతున్నారు. పైగా అమరావతిలోనే వాళ్ల ఆస్తులన్నీ ఉన్నాయట. త్వరలోనే మీరు ఊహించలేనంత రిటర్న్స్ చూపిస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇది విన్న వారంతా షాక్ అవుతున్నారు. చంద్రబాబు వస్తే అమరావతికి తప్ప ఎవ్వరికీ ఇసుమంత మేలు జరగదని ఆందోళన చెందుతున్నారు. ఈ ఆడియో ఏపీలో సంచలనంగా మారింది. ప్రతి ఒక్కరి ఫోన్‌లోనూ ఇదే ఆడియో..!

Google News