నాడు టీడీపీ సుద్దులు.. నేడు మహిళల వివరాలు సేకరణ

నాడు టీడీపీ సుద్దులు.. నేడు మహిళల వివరాలు సేకరణ

ఊరందరికీ శకునం చెప్పే బల్లి కుడితి తొట్లో పడి చచ్చిందన్నట్టుగా ఉంది టీడీపీ వైఖరి. ఊరందరికీ నీతులు చెప్పే ఈ పార్టీ చేసేవన్నీ అనైతిక పనులే. గతంలో రాష్ట్రంలోని మహిళలందరికీ సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారని.. ఆ సమాచారం కాస్తా కిడ్నాపర్లకు చేరి.. వాళ్లొచ్చి ఒంటరి మహిళలు.. ఏ ఆధారం లేని యువతులను కిడ్నాప్ చేస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆయన రాజకీయ భాగస్వామి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం వేదికల మీద కేకలు పెట్టారన్నారు. ఇప్పుడు ఈ ఎన్నికల తరుణంలో టీడీపీ రాష్ట్రంలోని మొత్తం మహిళలు, వారి వయసు.. ఊరు.. అడ్రస్.. చివరకు ఆధార్ నంబర్‌తో సహా అన్ని వివరాలనూ సేకరిస్తోంది.

‘వియ్’గా నామకరణం…!

గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సాధికార సర్వే పేరుతో ప్రజల సమాచారాన్ని సేకరించిన విషయం తెలిసిందే. అప్పట్లోనే డేటా చౌర్యానికి సైతం పాల్పడి టీడీపీ సేవా మిత్ర యాప్‌లో పొందుపరిచింది. దీనినే ఇప్పుడు మరింత ఆధునికీకరించి ‘వియ్’ యాప్ అని నామకరణం కూడా చేసింది. ఈ యాప్‌లో రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ఓటర్ల వివరాలన్నింటినీ పొందుపరుస్తున్నారు. పేర్లు, చిరునామాలు, ఆధార్, ఫోన్‌ నంబర్లు, ఓటరు ఐడీ నంబర్లు, వృత్తి తదితర వ్యక్తిగత వివరాలన్నీ వియ్ యాప్‌లో పొందుపరిచారు. వారు ఏ పార్టీ సానుభూతిపరులో కూడా ఇందులో ఉంది. చంద్రబాబు, పవన్‌లు చెప్పినట్టుగా ఇది ప్రజల వ్యక్తిగత గోప్యతకు పూర్తి విరుద్ధమే కదా? ప్రతి మహిళా వివరాలనూ సేకరించి తమ వద్ద దాచుకోవడం ద్వారా మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను సైతం హరించేందుకు కుట్ర పన్నుతున్నారు. ఇది పూర్తిగా అనైతికం ..

నాడు టీడీపీ సుద్దులు.. నేడు మహిళల వివరాలు సేకరణ

ఓటుకు రూ.5 వేలు..!

టీడీపీ అధికారంలో ఉండగా చేసిన దారుణాలు అన్నీ ఇన్నీ కావు. ప్రజా సాధికార సర్వే పేరుతో డేటా చౌర్యానికి పాల్పడ్డారు. ఇప్పుడు ‘వియ్’ యాప్‌లో ఓటర్ల సమగ్ర సమాచారాన్ని పొందుపరిచారు. ఓటర్ల స్లిప్పులతో ప్రత్యేక బార్‌కోడ్‌ ఉన్న కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. బార్‌కోడ్‌ స్కాన్‌ చేయగానే హైదరాబాద్‌ నుంచి డిజిటల్‌ చెల్లింపులు చేస్తున్నారు. ఒక్కో ఓటరుకు రూ.5 వేల చొప్పున చెల్లిస్తున్నట్లు సమాచారం.. బూత్‌ కమిటీల ద్వారా ఇంటింటా స్లిప్పుల పంపిణీ చేస్తున్నారు. దీని పర్యవేక్షణ, బార్‌కోడ్‌ స్కాన్‌కు మరో బృందం పని చేస్తోంది. మొత్తం పర్యవేక్షణకు హైదరాబాద్‌లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌.. నియోజకవర్గానికి రూ.87.50 కోట్ల చొప్పున డిజిటల్‌ చెల్లింపులు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.. ఈ డిజిటల్ చెల్లింపులకు ప్రజల పూర్తి వివరాలను టీడీపీ సేకరిస్తోంది. ఇది దుర్వినియోగమైతే తమ భద్రతకు పెను ముప్పు అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Google News