మారని టీడీపీ తీరు.. డీబీటీ లబ్ధిదారులతో పచ్చ ముఠా చెలగాటం!

మారని టీడీపీ తీరు.. డీబీటీ లబ్ధిదారులతో పచ్చ ముఠా చెలగాటం!

అమ్మ పెట్టా పెట్టదు.. అడుక్కు తినా తిననివ్వదు అన్నట్టుగా ఉంది టీడీపీ వ్యవహారం. టీడీపీ తీరు మారేలా కనిపించడం లేదు. డీబీటీ లబ్ధిదారులతో పచ్చ ముఠా ఇంకా చెలగాటం ఆడుతూనే ఉంది. లబ్దిదారులను టీడీపీ ముఠా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. కనీసం హైకోర్టు ఉత్తర్వులను సైతం అమలు చేయనివ్వడం లేదు. ఈసీపై తీవ్ర ఒత్తిడి తెచ్చి మరీ హైకోర్టు ఉత్తర్వులను అడ్డుకుంటోంది. డీబీటీ పథకాలను అడ్డుకుంటోంది. ఈసీ ఉత్తర్వులను ఇవాళ్టి వరకూ నిలిపివేస్తూ హైకోర్టు తీర్పును వెలువరించింది.

హైకోర్టు ఉత్తర్వులు నిన్న అర్థరాత్రి అందుబాటులోకి వచ్చాయి. ఆ వెంటనే హైకోర్టు కాపీతో ఏపీకి చెందిన అధికారులు ఈసీని సంప్రదించారు. ఈసీని అధికారులు క్లారిఫికేషన్ కోరగా ఇప్పటి వరకూ ఎలాంటి క్లారిఫికేషన్‌నూ ఈసీ ఇవ్వకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఎన్నికల సంఘం పరిధిలో పని చేస్తున్నామని.. కాబట్టి ఈసీ క్లారిఫికేష్ ఇస్తే తప్ప ముందుకు వెళ్లలేమని అధికారులు చెబుుతున్నారు. ఈసీ క్లారిఫికేషన్ ఆలస్యమైతే హైకోర్టు ఇచ్చిన గడువు ముగిపోతోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు హైకోర్టు ఉత్తర్వులను అడ్డుకునేందుకు టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. నవతరం పార్టీ తరఫున పరోక్షంగా కోర్టులో టీడీపీ అప్పీల్ వేసింది. తమకు ఫిర్యాదులు వచ్చాయని.. అందుకే పథకాలను నిలిపివేశామని ఈసీ చెబుతోంది. దీంతో టీడీపీ బాగోతం బయటపడింది. ఇప్పటికే పెన్షన్‌దారులకు ఫస్ట్ తారీఖు వచ్చిందంటే ఇంటికెళ్లి మరీ డబ్బులు అందజేసే వలంటీర్ వ్యవస్థకు గండికొట్టింది. అది చాలదన్నట్టుగా ఇప్పుడు డీబీటీ పథకాలను సైతం అడ్డుకుంటోంది. అసలు ఇదంతా చేస్తూ టీడీపీ ఏం సాధించాలనుకుంటోందో ఏమీ అర్థం కావడం లేదు. మొత్తానికి పేదల విషయంలో పదే పదే కల్పించుకుంటూ వారిని ఇబ్బందిపెట్టే పనిలోనే టీడీపీ ఉంటోంది.