వావ్.. క్రేజ్ కా బాప్.. మిలియన్స్ దాటిన జగన్ ఇంటర్వ్యూ వ్యూస్!

వావ్.. క్రేజ్ కా బాప్.. మిలియన్స్ దాటిన జగన్ ఇంటర్వ్యూ వ్యూస్!

సచిన్ టెండూల్కర్ స్టేడియంలో పాక్‌ బౌలర్స్‌ను ఒకాట ఆడుకుంటే ఎలా ఉంటుంది? అసలు భారత్, పాక్ మ్యాచే హోరెత్తించేదైతే.. ఇక వారిని సచిన్ ఆ మ్యాచ్‌లో చెలరేగి పోతే ఇక అసలు స్టేడియం బద్దలైపోదూ.. సునామీ వస్తే సముద్రం పరిస్థితేంటి అల్లకల్లోలమై పోతుంది. అచ్చు గుద్దినట్టు అలాగే ఇప్పుడు జగన్ ఇంటర్వ్యూ చర్చనీయాంశంగా మారిపోయింది. టీవీ 9 టీఆర్పీ రేటింగ్స్ బౌండరీలు దాటి పోయింది. వ్యూస్ మిలియన్స్ దాటేశాయి. అభివృద్ధి, సంక్షేమం…వంటి పలు అంశాలకు సంబంధించి జగన్ ప్రజల సందేహాలకు స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. ప్రజల మనసులోని సందేహాలన్నింటినీ టీవీ – 9 యాంకర్ రజనీకాంత్ జగన్ ముందు పెట్టారు. వాటన్నింటినీ జగన్ చాలా క్లియర్‌గా నివృత్తి చేశారు. భూ సర్వే గురించి.. ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించిన సందేహాలన్నింటికీ జగన్ క్లియర్‌గా సమాధానాలు ఇచ్చారు.

ఒకసారి తప్పు చేస్తే పొరపాటు.. రెండో సారి చేస్తే గ్రహపాటు..

అసలు తన విజన్ ఏమిటి..? ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేశారు? తన పాలనా విధానం ఏమిటి? అనే విషయాలన్నింటికీ స్పష్టంగా ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా సమాధానం ఇచ్చారు. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి ఇచ్చిన పంచ్ ఓ రేంజ్‌లో పేలింది. సోషల్ మీడియాలో ఇది తెగ వైరల్ అవుతోంది. ‘ఒకసారి తప్పు చేస్తే పొరపాటు.. రెండో సారి చేస్తే గ్రహపాటు.. మూడు, నాలుగోసారి చేస్తే అలవాటు’ అంటూ పవన్ పెళ్లిళ్ల గురించి జగన్ చేసిన కామెంట్స్ జనంలోకి బాగా వెళ్లాయి. దీంతో పాటు ఆ ఇంటర్వ్యూలో జగన్ చెప్పిన కొన్ని అంశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంటర్వ్యూ మొత్తాన్ని పాయింట్స్.. పాయింట్స్‌గా కట్ చేసి వీడియోలను ఫోన్లలో సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూను లక్షల్లో ప్రజలు తమ ఫోన్లలో చూశారని లెక్కలు కనిపిస్తున్నాయి.

ఒక పక్క ప్రధాని మోదీ రోడ్ షో జరుగుతున్నా…

ఇది వైఎస్సార్ కాంగ్రెస్ క్యాడర్‌లో ఎక్కడ లేని ఉత్సాహాన్ని నింపింది. ఆ ఇంటర్యూను ఫోన్లలో పెద్ద ఎత్తున షేర్ కావడంతో.. లక్షల్లో షేర్లు… లైక్స్… కామెంట్స్‌తో సోషల్ మీడియా దుమ్ము రేగిపోయింది. ఈ ఇంటర్వ్యూ వైసీపీకి బీభత్సంగా మైలేజ్ తెచ్చి పెడుతుందని క్యాడర్ సంతోషిస్తోంది. మరోవైపు అదే సమయంలో ఏబీఎన్ ఛానెల్‌లో చంద్రబాబు ఇంటర్వ్యూ వచ్చినా పెద్దగా రేటింగ్ రాలేదు సరికదా.. అసలు ఆ ఇంటర్వ్యూనే చూసేవాళ్లే కరువయ్యారు. అటు జగన్ ఇంటర్వ్యూను లక్షల్లో చూడగా.. చంద్రబాబు మాటలు వేలల్లోనే ఉన్నాయి. ఈ రెండు ఇంటర్వ్యూలను చూసిన తర్వాత జనాలు బాబువి గాలిమూటలని ప్రజలు నిర్ణయానికి వచ్చారు. అందుకే అసలు బాబు ఇంటర్వ్యూని జనాలు పట్టించుకోలేదు. బాబు గత ముప్పయ్యేళ్లుగా చెప్పినవే చెబుతున్నారని… వాటిల్లో నిబద్ధత, నిజాయితీ, కొత్తదనం ఏమీ లేదని…అందుకే ఆ గాలిమాటలు వినడానికి ప్రజలు ఇష్టపడడం లేదని అంటున్నారు. ఒక పక్క ప్రధాని మోదీ రోడ్ షో జరుగుతున్నా… లైవ్ స్ట్రీమింగ్‌లో వ్యూస్ విపరీతంగా వచ్చాయి. అదే సమయంలో సీబిఎన్ ఇంటర్వ్యూ ఏబీఎన్‌లో ప్రసారమైతే కనీసం చూసే వారే కరువయ్యారు. ఇది సీఎం వైయస్ జగన్ కు ప్రజల్లో ఉన్న ఇమేజ్. వైయస్ అంటే ఒక బ్రాండ్ అని మరోసారి తేలిపోయింది.