తుపాకీ లైసెన్స్ కావాలంటూ పుట్టపర్తి ఎస్పీని కలిసిన సీనియర్ నరేష్

సీనియర్ నటుడు నరేష్.. ఈయన తెలియని వారు ఎవరూ ఉండరు. ఒకప్పుడు హీరోగా సీనియర్ నరేష్‌కు మంచి క్రేజ్ ఉండేది. సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారారు. పాత్ర ఏదైనా సరే జీవించేస్తారు. ఇక ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం వివాదాలమయం. వరుస పెళ్లిళ్లు.. భార్యలతో గొడవలు నానా రచ్చ. మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్.. ప్రస్తుతం పవిత్ర లోకేష్‌తో సహజీవనం చేస్తున్నారు. ఇక ఈ జంట మామూలు ఫేమస్ కాలేదు. 

మూడో భార్య రమ్య రఘుపతితో నరేష్‌కు విడాకులు అయిన వెంటనే పవిత్రా లోకేష్‌ను పెళ్లాడనున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే.. రమ్య రఘుపతి.. నరేష్‌ల ఆరోపణలు ప్రత్యారోపణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. రమ్య తాగుతుందని.. బెంగళూరు వెళ్లి అక్రమ సంబంధాలు పెట్టుకుందని.. మీడియా సాక్షిగా ఆమెపై తీవ్ర ఆరోపణలు చేశారు. అంతే కాకుండా తనను చంపించేందుకు తన మనుషులతో రెక్కీ చేయిందని కూడా నరేష్ ఆ మధ్య మీడియాకు తెలిపారు.

అది చాలదన్నట్టు ‘మళ్లీ పెళ్లి’ అనే సినిమా తీసి మరీ రమ్యను నరేష్ టార్గెట్ చేశారు. ఆమె క్యారెక్టర్‌ను చాలా చెత్తగా చూపించారు. ఇదిలా ఉండగా.. తాజాగా పుట్టపర్తి ఎస్పీని నరేష్ కలవడం ఆసక్తికరంగా మారింది. తనకు ప్రాణ హాని ఉందని.. కాబట్టి ఆత్మ రక్షణ కోసం తుపాకీ లైసెన్స్ జారీ చేయాలని ఎస్పీని కోరారట. ప్రస్తుతం పుట్టపర్తి ఎస్పీ మాధవరెడ్డితో నరేష్ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇవీ చదవండి:

విడుదలకు ముందే ప్రాజెక్ట్ K మూవీకి అరుదైన గౌరవం

ఇన్‌స్టాగ్రామ్‌లో పవన్‌ కల్యాణ్‌ రికార్డ్.. ఇక అత్యధిక ఫాలోవర్స్ కలిగిన సినీ సెలబ్రిటీలెవరో తెలుసా? 

‘సలార్’ టీజర్.. ఫ్యాన్స్‌కి పూనకాలే.. ఆసక్తికర విషయం ఏంటంటే..

సినిమాలకు బ్రేక్.. నిర్మాతలు, ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చిన సమంత

Sootiga Team

Recent Posts

‘Mr Bachchan’ has sizzling romance between lead pair

Director Harish Shankar knows the importance of music in generating buzz, thus he has taken…

August 2, 2024

తెగ ట్రోలింగ్ అవుతోన్న కీర్తి

ఒకే ఒక్క ఇంటర్వ్యూతో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది హీరోయిన్ కీర్తిసురేష్. కొన్ని అంశాలపై ఆమె స్పందించిన తీరు వైరల్…

August 2, 2024

Congress to move privilege motion against PM Modi

The Congress party is considering filing a privilege motion against Prime Minister Narendra Modi and…

July 31, 2024

మెడ్ ప్లస్ వివాదంలో శివజ్యోతి

బుల్లితెరపై సావిత్రి బాగా పాపులర్ అయ్యారు శివజ్యోతి. తెలంగాణ యాసలో వార్తలు చదివి క్రేజ్ తెచ్చుకున్నారు. బిగ్ బాస్ షోలో…

July 31, 2024

తొడలు చూపిస్తోన్న కాంతార సుందరి

"కాంతార" సినిమాలో హీరోయిన్ గా నటించిన సప్తమి గౌడ గుర్తుందా? ఆ సినిమాలో గిరిజన ప్రాంతానికి చెందిన లేడి కానిస్టేబుల్…

July 31, 2024

అది ఫేక్ అంటున్న అన్నపూర్ణ

ఈమధ్య కాస్టింగ్ కాల్ కల్చర్ బాగా పెరిగింది. పెద్ద సినిమాలు కూడా కాస్టింగ్ కాల్స్ ఇస్తున్నాయి. మొన్నటికిమొన్న చరణ్ తో…

July 31, 2024