Samantha: సినిమాలకు బ్రేక్.. నిర్మాతలు, ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చిన సమంత

Samantha: సినిమాలకు బ్రేక్.. నిర్మాతలు, ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చిన సమంత

స్టార్ హీరోయిన్ సమంత(Samantha), నిర్మాతలు, ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చింది. ఈ మేరకు సామ్ కీలక నిర్ణయం తీసుకుంది. సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. కారణం ఏంటో వెల్లడించలేదు కానీ ఇప్పటికే పలు సినిమాలకు అంగీకరించి తీసుకున్న అడ్వాన్స్‌ను నిర్మాతలకి తిరిగి ఇచ్చేసినట్టు ఫిలింగనర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తన చేతిలో ఉన్న ప్రాజెక్టులు అన్నీ దాదాపు పూర్తి కావొచ్చాయి. 

మరో రెండు రోజుల్లో ఖుషి(Kushi) సినిమా షూటింగ్ పూర్తి కానుంది. అలాగే ఆమె చేస్తున్న వెబ్ సిరీస్ ‘సిటాడెల్’(Citadel) కూడా దాదాపు పూర్తి కావొచ్చింది. ఇవి రెండు పూర్తయిన తర్వాత చేయాలని కొన్ని సినిమాలను కూడా ఒప్పుకుని అడ్వాన్స్ తీసుకుంది. కానీ ఏమైందో ఏమో కానీ ఆ అడ్వాన్స్‌ను సైతం నిర్మాతలకు వెనక్కి ఇచ్చేసిందట. మరి ఏ సినిమాకూ సమంత సైన్ చేయలేదని తెలుస్తోంది. దీంతో నిర్మాతలు షాక్ అయ్యారని తెలుస్తోంది.

Samantha break to films

సమంత  నిర్ణయంతో ఫ్యాన్స్, సినిమా ఇండస్ట్రీ షాక్ అయ్యింది. అయితే సినిమాలకు సామ్(Samantha Ruth Prabhu) బ్రేక్ ఇవ్వడానికి కారణం.. ఆమె ఆరోగ్యమేనని తెలుస్తోంది.

ఇటీవల మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడిన సమంత.. దానికి కొద్ది రోజుల పాటు చికిత్స కూడా తీసుకుంది. అంతా ఆమెకు సమస్య తొలిగిపోయిందనే భావించారు. కానీ సినిమాలకు బ్రేక్ చెప్పడంతో తిరిగి అనారోగ్య సమస్యలేమైనా తలెత్తాయేమోనని అంతా భావిస్తున్నారు. సామ్ మాత్రం ప్రస్తుతం పూర్తిగా తన ఆరోగ్యంపైనే దృష్టి పెట్టిందట.

ఇవీ చదవండి:

మెగా ఫ్యామిలీలో మరొకరు విడాకులు.. అనుకున్నదే జరిగిందే..!

ఇదీ పవన్ కల్యాణ్ అంటే… 2 మిలియన్లకు చేరువలో ఇన్‌స్టా ఫాలోవర్లు

దూకుడు మీదున్న యంగ్ టైగర్‌.. ‘దేవర’ ఐదో షెడ్యూల్ గురించి ఆసక్తికర అప్‌డేట్..

కేజీఎఫ్ 2కి.. సలార్‌కి లింకేంటి?.. నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్

ఇకపై పవన్‌కి దూరం అంటూ బండ్ల గణేష్ సంచలన ట్వీట్..

Google News