Bandla Ganesh: ఇకపై పవన్‌కి దూరం అంటూ బండ్ల గణేష్ సంచలన ట్వీట్..

Bandla Ganesh: ఇకపై పవన్‌కి దూరం అంటూ బండ్ల గణేష్ సంచలన ట్వీట్..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) తన దేవుడంటూ చెప్పుకొచ్చే నిర్మాత, నటుడు బండ్ల గణేష్(Bandla Ganesh) ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా ప్రకటించారు. ఇకపై తాను పవన్‌కు దూరంగా ఉంటానని.. ఆయన పేరు వాడుకుని లబ్ది పొందబోనని స్పష్టం చేశారు. బండ్ల గణేష్‌ ట్వీట్‌పై అటు టాలీవుడ్ వర్గాల్లోనూ.. ఇటు నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నిజానికి పవన్‌కు బండ్ల గణేష్ వీరాభిమాని.

బండ్ల గణేష్ నిర్మాతగా మారాక పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఆయనకు అవకాశం ఇచ్చారు. వీరిద్దరి కాంబోలో తీన్ మార్, గబ్బర్ సింగ్ చిత్రాలు తెరకెక్కాయి. తీన్‌మార్ మూవీ అటకెక్కగా.. గబ్బర్ సింగ్ మాత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇక ఆ తరువాత తన దేవుడితో సినిమా చేయడం కోసం వెయిట్ చేస్తున్నానంటూ బండ్ల గణేష్ చాలా సార్లు తెలిపారు. కానీ పవన్ నుంచి మాత్రం సానుకూల స్పందన రాలేదు. అయితే ఇటీవలి కాలంలో వీరిద్దరి మధ్య గ్యాప్ బీభత్సం పెరిగింది.

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బండ్ల గణేష్‌(Bandla Ganesh)ను ఆహ్వానించలేదు. దీనికి కారణం.. పవన్‌కి అత్యంత ఆప్తుడైన త్రివిక్రమేనని పేర్కొంటూ బండ్ల గణేష్ అనుచిత కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన ఆడియో సంభాషణ కాస్త లీక్ అవడంతో పవన్ ఆయనను దూరం పెట్టేశారు. అప్పటి నుంచి వీరిద్దరూ కలిసింది లేదు. ఈ క్రమంలోనే నిన్న గురు పౌర్ణమి సందర్భంగా బండ్ల ట్వీట్ చేశారు. పవన్ స్థాయి తెలిసిన వాడిగా చెబుతున్నానని ఆయన కోరుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారన్నారు. ఇకపై ఆయన పేరు, కీర్తిని ఏ విధంగానూ తాను వాడుకుని లబ్ది పొందబోనని బండ్ల గణేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

బాల్స్ లేవు.. వజైనా ఉందంటూ అనసూయను ఇచ్చిపడేసిందిగా..!

ఇన్‌స్టాలోకి పవన్ కల్యాణ్‌.. ఆయన రికార్డ్‌ను బ్రేక్ చేస్తారా?

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో భారీ పాన్ ఇండియా మూవీ.. అనౌన్స్‌మెంట్ వచ్చేసింది..

నిహారికతో విడాకులపై చైతన్య జొన్నలగడ్డ క్లారిటీ ఇచ్చేసినట్టేనా?

Google News