కేజీఎఫ్ 2కి.. సలార్‌కి లింకేంటి?.. నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్

కేజీఎఫ్ 2కి.. సలార్‌కి లింకేంటి?.. నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్

కేజీఎఫ్ సిరీస్‌తో ఎవరూ ఊహించని హిట్ కొట్టిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన హీరో ప్రభాస్. ఇక వీరిద్దరి కాంబోలో మూవీ అంటే బాక్సాఫీస్‌ని దున్నేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా. కేజీఎఫ్ 3 ఉంటుందన్న వాదన బలంగా వినిపిస్తున్న సమయంలో ప్రశాంత్ నీల్.. సలార్ టీజర్‌కు కేజీఎఫ్ 2 క్లైమాక్స్‌కు ఓ లింక్ పెట్టేశారు. ఇక అంతే.. ఇది తెలుసుకున్న ఫ్యాన్స్‌లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది.

ప్రభాస్ కి ఉన్న ఇమేజ్‌కి.. ప్రశాంత్ నీల్ లాంటి దర్శకుడు తోడైతే.. ఇక ఆ సినిమా ఊహకు కూడా అందదని ఫ్యాన్స్ గట్టి నమ్మకం. ఆ నమ్మకాన్ని ప్రశాంత్ నీల్ వమ్ము చేయరనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే సలార్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఇక సలార్ టీజర్ కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేజీఎఫ్‌లో భాగంగానే సలార్ టీజర్ రానుందట.

salaar telugu movie

సలార్ టీజర్‌ను ఈ నెల 6న ఉదయం 5:12 నిమిషాలకు చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. ముఖ్యంగా ఈ టైమ్‌పై జనాలు ఫోకస్ చేస్తున్నారు. ఏదైనా టీజర్ అంటే ఉదయం 10 తర్వాత రిలీజ్ చేస్తారు. కానీ తెల్లవారుజామున ఏంటి? కేజీఎఫ్ 2 క్లైమాక్స్ ఎవరికైనా గుర్తుంటే.. రాఖీ భాయ్ మీద సముద్రంలో అటాక్ జరిగేది అదే సమయానికి. ఆ సన్నివేశంలో ఓ గడియారంలో టైం 5:12 నిమిషాలు అయినట్టుగా చూపించారు. రాఖీ భాయ్ మీద అటాక్ జరిగే టైం కి సలార్ టీజర్ రిలీజ్ చేస్తుండటంతో ఈ చిత్రానికి.. కేజీఎఫ్ 2కి లింక్ ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

ఇవీ చదవండి:

ఇన్‌స్టాలోకి పవన్ కల్యాణ్‌.. ఆయన రికార్డ్‌ను బ్రేక్ చేస్తారా?

బాల్స్ లేవు.. వజైనా ఉందంటూ అనసూయను ఇచ్చిపడేసిందిగా..!

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో భారీ పాన్ ఇండియా మూవీ.. అనౌన్స్‌మెంట్ వచ్చేసింది..

ఇది నిజమేనా? యాంకర్ రష్మి ఆ షోలో మెరవనుందా?