Anchor Rashmi: ఇది నిజమేనా? యాంకర్ రష్మి ఆ షోలో మెరవనుందా?

Anchor Rashmi: ఇది నిజమేనా? యాంకర్ రష్మి ఆ షోలో మెరవనుందా?

హాట్ యాంకర్ రష్మీ గౌతమ్.. పదికి పైగా చిత్రాల్లో మెరిసింది. కానీ ఎందుకో గుర్తింపు తెచ్చి పెట్టే మూవీ ఒక్కటి కూడా లేదు. వెండితెరపై సక్సెస్ కాలేకపోయినా కూడా బుల్లితెరపై మాత్రం కావల్సినంత పాపులారిటీని సంపాదించుకుంది. ముఖ్యంగా జబర్దస్త్ షో ద్వారా ఫేమస్ అయిన వారిలో యాంకర్ రష్మి ఒకరు. ఈ మధ్య ఈ ముద్దుగుమ్మ కనిపించినంతగా బుల్లితెరపై ఏ లేడీ యాంకర్ కూడా కనిపించడం లేదు.

ఎక్స్‌ట్రా జబర్దస్త్‌తో మొదలు పెడితే.. శ్రీదేవి డ్రామా కంపెనీ తదితర షోలకు యాంకర్‌గా చేస్తోంది. ఇవి మాత్రమే కాకుండా.. ప్రమోషన్స్, ఈవెంట్స్, సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ ద్వారా రష్మీ బీభత్సంగా సంపాదిస్తోంది. ఇక ఈ సారి యాంకర్ రష్మి బిగ్‌బాస్ షోలో మెరవనుంది. అమ్మడిని ఈ షోకి తీసుకు రావాలని ప్రయత్నాలు బీభత్సంగానే జరుగుతున్నాయి.

Anchor Rashmi: ఇది నిజమేనా? యాంకర్ రష్మి ఆ షోలో మెరవనుందా?

సీజన్ 1 ప్రారంభం నుంచే యాంకర్ రష్మిని బిగ్‌బాస్‌ షోకి తీసుకురావాలని నిర్వాహకులు యత్నించారని టాక్. కానీ రష్మి ససేమిరా అంటోందట. ఇప్పుడు మాత్రం అంగీకరించినట్టు టాక్ నడుస్తోంది. కానీ అమ్మడు ఇటీవలి కాలంలో ఫుల్ బిజీగా మారిపోయింది. ఇప్పుడున్న షోలన్నింటినీ వదులుకుని బిగ్‌బాస్‌కి వెళుతుందా? అంటే వెళ్లడం చాలా కష్టమే. ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చినా కూడా ఇప్పటికైతే ఇది అసాధ్యమే.

ఇవీ చదవండి:

పొట్టి నిక్కర్‌తో జిమ్‌లో వర్కవుట్స్‌తో అందాలను ఆరబోసిన యాంకర్ అనసూయ

ఆమెతో సుడిగాలి సుధీర్ ఎంగేజ్‌మెంట్.. మరి రష్మి పరిస్థితేంటంటూ ఫ్యాన్స్ గగ్గోలు..

తొలిరోజు వసూళ్ల సునామీ సృష్టించిన ‘తొలిప్రేమ’

రామ్ చరణ్ కూతురి పేరు ఎక్కడి నుంచి తీసుకున్నారో తెలుసా?

Google News