Tholi Prema: తొలిరోజు వసూళ్ల సునామీ సృష్టించిన ‘తొలిప్రేమ’

Tholi Prema: తొలిరోజు వసూళ్ల సునామీ సృష్టించిన ‘తొలిప్రేమ’ 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సినీ లైఫ్‌ను టర్న్ చేసిన సినిమా ‘తొలిప్రేమ’(Tholi Prema). అప్పటి వరకూ చిరంజీవి తమ్ముడుగానే గుర్తింపు ఉన్న పవన్‌కు ఈ సినిమాతో తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ వచ్చింది. ఈ సినిమా విడుదలైన తర్వాత పవన్ వచ్చేసి యూత్ ఐకాన్‌గా, స్టార్ హీరోగా మారిపోయాడు. ఆ రోజుల్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాక్సాఫీస్‌ను గడగడలాడించింది. ఇక ముఖ్యంగా నైజాం ఏరియాలో అయితే ఒక సునామీనే సృష్టించింది.

ఈ సినిమా బుల్లితెరపై సైతం ఎన్నోసార్లు ప్రసారం అయ్యింది. అయినా కూడా ప్రేక్షకుల స్పందన ఓ రేంజ్‌లో ఉండేది. ఇక ఈ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మేకర్స్ రీ రిలీజ్ చేశారు. ఈ సినిమాను చిత్రబృందం 4కె వెర్షన్‌లో విడుదల చేసింది. అయితే ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో ఇక ఈ సినిమా విడుదలైన ప్రేక్షకులు థియేటర్లకు రావడం కష్టమేనని అంతా భావించారు.

Tholi Prema: తొలిరోజు వసూళ్ల సునామీ సృష్టించిన ‘తొలిప్రేమ’ 

కానీ ఈ సినిమాకు షాకింగ్ స్థాయిలో ఓపెనింగ్స్ దక్కాయి. దాదాపు మూవీ ప్రదర్శించబడిన అన్ని ప్రాంతాల్లో థియేటర్లన్నీ ప్రేక్షకులతో కళకళలాడాయి. నిజానికి వర్కింగ్ డే రోజున మూవీ విడుదలైతే జనాలు థియేటర్లకు వెళ్లడం చాలా కష్టం. కానీ అనూహ్యంగా థియేటర్‌లన్నీ హౌస్ ఫుల్ అయిపోయాయి. దీంతో తొలి రోజు ఈ చిత్రం రూ.కోటిన్నర గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రానికి ఈ స్థాయిలో జనం నీరాజనం పలకడం చూసి ట్రేడ్ పండితులు సైతం అవాక్కవుతున్నారు.

Google News