Sudigali Sudheer: ఆమెతో సుడిగాలి సుధీర్ ఎంగేజ్‌మెంట్.. మరి రష్మి పరిస్థితేంటంటూ ఫ్యాన్స్ గగ్గోలు..

Sudigali Sudheer: ఆమెతో సుడిగాలి సుధీర్ ఎంగేజ్‌మెంట్.. మరి రష్మి పరిస్థితేంటంటూ ఫ్యాన్స్ గగ్గోలు..

జబర్దస్త్‌ షోతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు సుడిగాలి సుధీర్‌(Sudigali Sudheer). ఆ తరువాత వెండితెరపై కూడా హీరోగా మెరిశాడు. మల్టీ టాలెంటెడ్ అయిన సుధీర్ ప్రస్తుతం పలు షోలల్లో మెరుస్తున్నాడు. ఇక సుడిగాలి సుధీర్‌కి ఓ రేంజ్‌లో గుర్తింపు రావడానికి యాంకర్ రష్మి(Anchor Rashmi) కూడా ఒక కారణమే. రష్మితో లవ్ ట్రాక్ సుధీర్‌కి బాగా కలిసొచ్చింది. నిజానికి వీరిద్దరి జోడికి టాలీవుడ్‌లో ప్రత్యేకమైన ఫ్యాన్‌ బేస్‌ ఉంది.

ఇద్దరూ కలిసి ఏదైనా సాంగ్ చేశారంటే జీవించేస్తారు. ఈ క్రమంలోనే వీరిద్దరి జంటకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అయితే వీరిద్దరి ప్రేమ వ్యవహారమంతా ఆన్ స్క్రీన్‌ మీదేననని వారిద్దరూ చాలా సార్లు క్లారిటీ ఇచ్చారు. వారి తోటి ఆర్టిస్టులు సైతం వీరిద్దరి మధ్య ఏమీ లేదని చెప్పుకొచ్చారు. అయినా పుకార్లు ఆగవు. ఇక సుడిగాలి సుధీర్(Sudigali Sudheer) త్వరలోే పెళ్లిపీటలెక్కబోతున్నాడని టాక్.

Sudigali Sudheer Rashmi

వరుసకు మరదలు అయ్యే తన బంధువుల అమ్మాయినే సుడిగాలి సుధీర్‌ పెళ్లి చేసుకుంటాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇటీవలే సుధీర్‌కు తన మరదలితో ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిందని టాక్. ఈ కార్యక్రమం సింపుల్‌గా జరిగిపోయిందట. అయితే సుడిగాలి సుధీర్ – రష్మిల(Sudigali Sudheer-Rashmi) జంట ఒక్కటవ్వాలని కోరుకునే వారికి మాత్రం ఇది షాకింగ్ న్యూసే. దీంతో సోషల్ మీడియా వేదికగా వారంతా తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. కానీ సుధీర్ మాత్రం రెస్పాండ్ అవడం లేదు.

Google News