Ram Charan daughter: రామ్ చరణ్ కూతురి పేరు ఎక్కడి నుంచి తీసుకున్నారో తెలుసా?

Ram Charan daughter: రామ్ చరణ్ కూతురి పేరు ఎక్కడి నుంచి తీసుకున్నారో తెలుసా?

రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులు కొద్ది రోజుల క్రితం తల్లిదండ్రులుగా ప్రమోషన్ కొట్టేసిన విషయం తెలిసిందే. వారసురాలి రాకతో మెగాస్టార్ చిరంజీవి కుటుంబం ఆనంద పారవశ్యంలో మునిగి తేలుతోంది. తమకు ఎంతగానో ఇష్టమైన మంగళవారం పాప పుట్టడం మరింత ఆనందానికి గురి చేసిందని చిరంజీవి పేర్కొన్నారు. పుట్టిన మూడు రోజులకే మెగా వారసురాలు ఇంటికి చేరింది. 

ఇప్పటి వరకూ చిన్నారి ఫేస్‌ను అయితే పూర్తిగా రివీల్ చేయలేదు. అయితే శుక్రవారం ఈ చిట్టితల్లికి మెగా కుటుంబం బారసాల కార్యక్రమం నిర్వహించి నామకరణం చేసింది. పాపకు ఆసక్తికర పేరును పెట్టింది. ఆమెను ఊయలలో వేసిన ఫొటోను తాతయ్య చిరంజీవి తమ అభిమానుల కోసం ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. మనవరాలికి ‘క్లీంకార కొణిదెల’ అని పేరు పెట్టినట్లు చిరు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

Ram Charan daughter: రామ్ చరణ్ కూతురి పేరు ఎక్కడి నుంచి తీసుకున్నారో తెలుసా?

నిజానికి పేరు చాలా ఆసక్తికరంగా అనిపించడంతో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇక మెగా వారసురాలి పేరును ఎక్కడి నుంచి తీసుకున్నారో కూడా చిరు రివీల్ చేశారు. ఈ పేరును లలితా సహస్రనామాల నుంచి తీసుకున్నట్లు చెప్పారు. క్లీంకార అనే పదం ప్రకృతి స్వరూపాన్ని, అమ్మవారి అనుగ్రహాన్ని సూచిస్తోందని చిరంజీవి తెలిపారు. తనలోఈ దైవిక గుణాలను ఇముడ్చుకొని క్లీంకార గొప్ప వ్యక్తిగా ఎదుగుతుందని ఆశిస్తున్నామని చెప్పారు.

ఇంకా చదవండి:

విమానాశ్రయంలో పూజా హెగ్డే చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా..

ట్రెండ్ సెట్ చేస్తున్న బ్రో టీజర్.. ఎన్ని వ్యూస్ రాబట్టిందో తెలిస్తే..

నా మొదటి లిప్ కిస్ అతనితోనే.. : క్లారిటీ ఇచ్చిన తమన్నా

Google News