Pooja Hegde: విమానాశ్రయంలో పూజా హెగ్డే చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా..

Pooja Hegde: విమానాశ్రయంలో పూజా హెగ్డే చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా..

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే(Pooja Hegde) ఏం చేసినా సమ్‌థింగ్ స్పెషలే. తాజాగా అమ్మడు చేసిన పనికి ఫ్యాన్స్ అయితే ఫిదా అయిపోతున్నారు. విమానాశ్రయాల్లో సెలబ్రిటీలు దర్శనమివ్వడం సర్వసాధారణం. ఏదో ఒక ఈవెంట్‌కో లేదంటే షూటింగ్‌కో హాజరవుతూ కెమెరాలకు చిక్కుతుంటారు. తాజాగా పూజా హెగ్డే కూడా కెమెరాలకు చిక్కింది. హైదరాబాద్ విమానాశ్రయంలో కెమెరాలకు చిక్కింది.

బ్లాక్ కలర్ బాడీకాన్ డ్రెస్‌లో అమ్మడు మరింత అందంగా మెరిసిపోయింది. హాట్ హాట్‌గా దర్శనమిచ్చింది. ఇక ఫోటో గ్రాఫర్లు ఆగుతారా? దొరికిందే ఛాన్స్ అని ఫోటోలు తీయడం మొదలు పెట్టారు. అమ్మడు కూడా చక్కగా చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజులివ్వడం విశేషం. ఓవైపు విమానాశ్రయంలో సెక్యూరిటీ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తూనే కెమెరాలకు చాలా అణకువగా ఏమాత్రం విసుక్కోకుండా పూజా ఫోజులిచ్చింది.

Pooja Hegde: విమానాశ్రయంలో పూజా హెగ్డే చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా..

విమానాశ్రయంలో అమ్మడి తీరుపై అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. పూజా హెగ్డే(Pooja Hegde) ఏం చేసినా అద్భుతంగానే ఉంటుందంటూ మురిసిపోతున్నారు. బ్లాక్ కలర్ బాడీకాన్ డ్రెస్‌లో తమ ఫేవరెట్ బుట్టబొమ్మ మెరిసిపోతోందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక కెరీర్ విషయానికి వస్తే ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లో వరుస ఫ్లాప్‌లు అందుకోవడంతో ఇక్కడ అవకాశాలు దాదాపు తగ్గిపోయాయి. మహేష్ ‘గుంటూరు కారం’(Guntur Kaaram) నుంచి పూజా(Pooja Hegde) తప్పుకుందని టాక్ నడుస్తోంది.

ఇవీ చదవండి:

నా మొదటి లిప్ కిస్ అతనితోనే.. : క్లారిటీ ఇచ్చిన తమన్నా

బ్రో నైజాం రైట్స్ ఎంతకు కోట్ చేశారో తెలిస్తే..

తన గురించి వైరల్ అవుతున్న న్యూస్‌పై లావణ్య త్రిపాఠి ఫైర్..

ఎన్టీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్

Google News