Lavanya Tripathi: తన గురించి వైరల్ అవుతున్న న్యూస్‌పై లావణ్య త్రిపాఠి ఫైర్..

Lavanya Tripathi: తన గురించి వైరల్ అవుతున్న న్యూస్‌పై లావణ్య త్రిపాఠి ఫైర్..

లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi).. ఏమాత్రం పరిచయం అక్కర్లేని పేరు. అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. ఆ తరువాత పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపే పొందింది. అయితే ఎందుకోగానీ స్టార్ హీరోయిన్స్ సరసన మాత్రం చేరలేకపోయింది. ఇక మెగా ఇంటికి కాబోయే కోడలు అని ఎప్పుడైతే తెలిసిందే.. అమ్మడి రేంజే మారిపోయింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే లావణ్య(Lavanya Tripathi), వరుణ్‌(Varun Tej)ల ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయింది. ఈ క్రమంలోనే వీరిద్దరూ పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు కొన్ని ఉన్నాయట. అవి పూర్తి చేసుకుని పెళ్లిపీటలెక్కుతారని టాక్. ప్రస్తుతం లావణ్య(Lavanya Tripathi) వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది. ఆమె తొలుత నటించిన పులిమేక వెబ్ సిరీస్ మంచి హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో ఇక లావణ్య తన ఫోకస్ అంతా వెబ్ సిరీస్‌లపైనే పెట్టిందట. ఇప్పుడు తెలుగులో రెండు వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది. 

ఇకపోతే.. తాజాగా లావణ్య(Lavanya Tripathi) గురించి ఓ న్యూ్స్ వైరల్ అవుతోంది. లావణ్యకు అరుదైన వ్యాధి ఏదో సోకిందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ వ్యాధి కారణంగా లావణ్య ఏది చూసినా భయపడిపోతోందట. దీనిపై లావణ్య(Lavanya Tripathi) తాజాగా స్పందించింది. తాను ఆరోగ్యపరంగా చాలా ఫిట్‌గా ఉన్నానని.. ఇలాంటి తప్పుడు న్యూస్ వైరల్ చేయవద్దని ఫైర్ అయ్యింది. అసలు ఇలాంటి న్యూస్ ప్రచారం చేయడం వలన మీకొచ్చే లాభం ఏంటంటూ మండిపడింది.

ఇవీ చదవండి:

డ్రైవర్‌తో కీర్తి సురేష్ లవ్.. ఫ్యాన్స్ ఫైర్..!

నా తండ్రి చావుకు కారణం వాళ్లే.. ఇప్పటికైనా ఆపేయండి: రాకేష్ మాస్టర్ కుమారుడు

ఆమె జీవితంలో ఇక నుంచి నేనే హీరో: సర్దార్ గబ్బర్ సింగ్ విలన్

సమంతకు సపోర్ట్ చేసిన అమల

మత్తుకు బానిసై నా భార్య డ్రగ్స్ విక్రేతతోనే అక్రమ సంబంధం పెట్టుకుంది: ప్రముఖ నిర్మాత సంచలనం

Google News