Amala Akkineni: సమంతకు సపోర్ట్ చేసిన అమల

Amala Akkineni: సమంతకు సపోర్ట్ చేసిన అమల

టాలీవుడ్(Tollywood) విషయానికి వస్తే.. సమంత – నాగచైతన్యల జంట నిత్యం వార్తల్లోనూ ఉంటూ వస్తోంది. ప్రేమ వ్యవహారం తెలిసినప్పటి నుంచి పెళ్లి.. ఆ తరువాత వైవిహిక జీవితం, విడిపోవడం వంటి అంశాలన్నీ హాట్ టాపిక్కే. సోషల్ మీడియాలో నిత్యం వీరిద్దరూ విడిపోయాక సైతం వార్తలు ఉంటూనే వస్తున్నాయి. నిజానికి వాళ్లిద్దరూ విడిపోయి ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. ఎవరి లైఫ్, కెరీర్‌లో వారు బిజీ.

సమంత(Samantha) బాలీవుడ్‌కి ఎదిగింది. అక్కడ కూడా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీబిజీగా కాలం గడిపేస్తుంది. నాగ చైతన్య టాలీవుడ్‌కే పరిమితమైన కూడా ఫుల్ బిజీగా మారిపోయాడు. వీళ్లిలా ఉంటే వీరి విషయాలను పట్టుకుని నెటిజనం వేలాడుతోంది. తాజాగా అక్కినేని అమల(Amala Akkineni) ఓ ఇంటర్వ్యూలో వీరిద్దరి విడాకుల వ్యవహారంపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

సెలబ్రిటీల జీవితం గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకోవడం సహజమని ఆమె అన్నారు. దానిని మనం మార్చలేమని తెలిపారు. ఇక సమంత(Samantha), నాగచైతన్య(Naga Chaitanya)ల విడాకుల వ్యవహారమనేది సీక్రెట్‌గా ఏమీ జరగలేదని.. పబ్లిక్‌గానే జరిగిందని అమల పేర్కొన్నారు. ఈ వ్యవహారం గురించి నెటిజన్ల అభిప్రాయాలను స్వీకరించడం మన బాధ్యత అని.. వారి అభిప్రాయాలను తాను స్వాగతిస్తున్నానని అమల తెలిపింది. దీంతో అమల నెటిజన్ల కామెంట్స్‌కు ఒకరకంగా మద్దతు తెలిపారంటూ సమంత(Samanth)పై నెటిజన్లు చేసిన కామెంట్స్ అన్నింటినీ ఆమె సమర్ధించారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Google News