Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో బిగ్‌బాస్ బ్యూటీ అషూరెడ్డి, ఈ నగరానికి ఏమైంది హీరో?

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో బిగ్‌బాస్ బ్యూటీ అషూరెడ్డి, ఈ నగరానికి ఏమైంది హీరో?

కబాలి(Kabali) నిర్మాత కృష్ణ ప్రసాద్‌ చౌదరి (Krishna Prasad Choudary) డ్రగ్స్‌ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కేపీ చౌదరి(KP Choudary)ని కస్టడీకి తీసుకున్న పోలీసులు.. ఆయన నుంచి కీలక సమాచారాన్ని రాబడుతున్నారు. తనకు డ్రగ్స్‌ అలవాటు ఉందని అంగీకరించిన నిర్మాత.. కొందరు నటీనటులకు డ్రగ్స్‌ అమ్మినట్లు పోలీసులకు వెల్లడించాడు. ఈ నటీనటుల లిస్ట్ ఇప్పుడు టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

రెండు రోజుల పాటు కేపీ చౌదరిని విచారించిన పోలీసులు అతడి ఫోన్‌లో కీలక ఆధారాలను సేకరించారు. ఈ విచారణలో కేపీ చౌదరి ఫోన్ కాల్స్ లిస్ట్‌లో బిగ్‌బాస్ బ్యూటీ అషూరెడ్డి(Ashu Reddy)తో పాటు ఓ ఐటెం సాంగ్ చేసిన హీరోయిన్‌తో వందల సంఖ్యలో కాల్స్‌ మాట్లాడినట్టు తేలింది. ఇక కేపీ చౌదరి.. ఈ నగరానికి ఏమైంది హీరో సుశాంత్ రెడ్డి(Sushanth Reddy)కి సైతం డ్రగ్స్ అమ్మినట్టు అంగీకరించినట్టు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా అషూరెడ్డితో పాటు సుశాంత్ రెడ్డి హైలైట్ అయ్యాడు.

Sushanth Reddy

తనపై వచ్చిన ఆరోపణలపై సుశాంత్ రెడ్డి(Sushanth Reddy) మాట్లాడుతూ.. కేపీ చౌదరి కేవలం నిర్మాతగా మాత్రమే తనకు తెలుసన్నాడు. ఆయనను కొన్ని సార్లు కలిశానని.. అప్పుడప్పుడు కాల్స్ మాట్లాడానని అంగీకరించాడు. అయితే మూడేళ్లుగా మాత్రం ఆయనను కలవలేదని తెలిపాడు. తనకు అసలు డ్రగ్స్(Drugs) అలవాటు లేదన్నాడు. అసలు కేపీ చౌదరికి తనకూ మధ్య ఏనాడూ డ్రగ్స్ గురించి టాపిక్ కూడా వచ్చింది లేదన్నాడు. తను ఎలాంటి టెస్ట్‌కి అయినా సిద్ధమని స్పష్టం చేశాడు.

Google News