Rashmika Mandanna: ఎవరి కెరీర్లో వారు మరింత ఎదగాలనుకున్నాం.. అందుకే విడిపోయాం: రష్మిక మందన

Rashmika Mandanna: ఎవరి కెరీర్లో వారు మరింత ఎదగాలనుకున్నాం.. అందుకే విడిపోయాం: రష్మిక

రష్మిక మందన(Rashmika Mandanna).. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఈ ముద్దుగుమ్మతో పాటే రూమర్స్ కూడా పెరిగాయి. తాజాగా ఈ అమ్మడు మోసపోయిందంటూ కథనాలు వెలువడ్డాయి. రష్మికను ఆమె ఎంతగానో నమ్మిన మేనేజరే దెబ్బేశాడని ప్రచారం జరుగుతోంది. చాలా నమ్మిన మేనేజర్‌కు డేట్స్, అకౌంట్స్ వంటి కీలక వ్యవహారాలను రష్మిక అప్పగించిందట. అయితే టైం చూసి సదరు మేనేజర్ ఆమెకు దెబ్బేశాడట.

రష్మిక మందన(Rashmika Mandanna) నుంచి ఆమె మేనేజర్ ఏకంగా రూ.80 లక్షలు కాజేశాడని టాక్ నడుస్తోంది. తాజాగా ఈ వార్తలపై రష్మిక స్పందించింది. తన మేనేజర్ ఎలాంటి మోసమూ చేయలేదని వెల్లడించింది. డబ్బు దొంగలించలేదని స్పష్టం చేసింది. తాము ప్రొఫెషనల్స్ కాబట్టి ఎవరి కెరీర్‌లో వాళ్లం మరింత ఎదగాలనుకున్నామని.. అందుకే ేఆయన తన వద్ద నుంచి వెళ్లిపోయారని చెప్పింది. ఇందులో ఎలాంటి వివాదం లేదని తేల్చేసింది.

పరస్పర అవగాహనతోనే విడిపోయామని రష్మిక వెల్లడించింది. నిజానికి సదరు మేనేజర్.. రష్మిక మందన(Rashmika Mandanna) వద్ద చాలా ఏళ్లుగా పని చేస్తున్నాడు. అలాంటి వ్యక్తిని సడెన్‌గా తొలగించడంతో చాలా అనుమానాలు తలెత్తాయి. కానీ రష్మిక వీటన్నింటినీ కొట్టి పడేస్తోంది. ఈ క్రమంలోనే రష్మిక మందన(Rashmika Mandanna) చెప్పేది అబద్ధమని కొందరు అంటున్నారు. ప్రస్తుతం రష్మిక టాలీవుడ్‌లో సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2(Pushpa2)లో నటిస్తోంది.

ఇవీ చదవండి:

మహేష్ వేధింపుల వల్లే పూజా హెగ్డే ‘గుంటూరు కారం’ నుంచి తప్పుకుందట.. దీనిలో నిజమెంత?

లిప్ కిస్ ఇవ్వాల్సి ఉంటుందని బ్లాక్ బస్టర్ హిట్ మూవీని వదిలేసిన లావణ్య త్రిపాఠి

రామ్ చరణ్ కూతురి జాతకంపై సంచలనం విషయాలు వెల్లడించిన వేణుస్వామి

డైరెక్టర్ కృష్ణవంశీ, నేను ఒకే అమ్మాయిని ప్రేమించాం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. : జేడీ చక్రవర్తి

Google News