JD Chakravarthy: డైరెక్టర్ కృష్ణవంశీ, నేను ఒకే అమ్మాయిని ప్రేమించాం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. : జేడీ చక్రవర్తి

JD Chakravarthy: డైరెక్టర్ కృష్ణవంశీ, నేను ఒకే అమ్మాయిని ప్రేమించాం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. : చక్రవర్తి

జేడీ చక్రవర్తి(JD Chakravarthy).. ఏమాత్రం పరిచయం అక్కర్లేనిపేరు. శివ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి గులాబీ మూవీతో హీరోగా మారాడు. ఈ మూవీని దర్శకుడు కృష్ణవంశీ(Krishnavamsi) తెరకెక్కించారు. అప్పట్లో ఈ మూవీ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటికీ ఈ మూవీలోని సాంగ్స్ అక్కడక్కడ వినిపిస్తూనే ఉంటాయి. ఈ న్యూ ఏజ్ లవ్ డ్రామా కృష్ణవంశీకి డెబ్యూ మూవీ కావడం మరో విశేషం. ఈ సినిమాలో చక్రవర్తికి జంటగా మహేశ్వరి నటించింది.

గులాబీ(Gualabi) సినిమా అటు చక్రవర్తికి ఇటు మహేశ్వరికీ మంచి హైప్ ఇచ్చింది. ఇక ఆ తర్వాత వీరిద్దరూ కలిసి మరికొన్ని సినిమాల్లో నటించారు. అదే సమయంలో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ ప్రచారం మొదలైంది. తాజాగా ఈ ప్రచారంపై జేడీ చక్రవర్తి తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. తానెప్పుడూ మహేశ్వరిని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదన్నారు. పెళ్లి ఆలోచనే లేదు కాబట్టే తామిద్దరం ఒక్కటి కాలేదన్నారు. అసలు ఆమెతో తనకు ఎలాంటి అఫైర్ ఎప్పుడూ లేదని చక్రవర్తి చెప్పుకొచ్చారు.

ఇక జేడీ చక్రవర్తి(JD Chakravarthy) ఈ ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు. అదేంటంటే.. ఒక సినిమా షూటింగ్ సమయంలో తాను, దర్శకుడు కృష్ణవంశీ(Krishnavamsi) ఒకే అమ్మాయిని ప్రేమించారట. అయితే ఆ అమ్మాయి మాత్రం పెద్ద ట్విస్టే ఇచ్చిందట. ఇద్దరినీ అన్నయ్య అని పిలిచిందట. ఇక అంతే.. ఇద్దరూ దెబ్బకు డల్ అయిపోయారట. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరనేది మాత్రం చక్రవర్తి రివీల్ చేయలేదు. జనాలు మాత్రం ఆ అమ్మాయి మహేశ్వరియే అయి ఉంటుందని చర్చించుకుంటున్నారు.

ఇవీ చదవండి:

రాకేష్ మాస్టర్ దుస్థితి గురించి తెలిస్తే కన్నీళ్లాగవు..!

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన.. సంబరాల్లో మెగా ఫ్యామిలీ

‘ఆదిపురుష్’ కీలక పాత్రధారులు ఎంతెంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలిస్తే..

తల్లితో సమానమైన ఆమెతో అఫైర్స్ అంటగట్టకండి: ప్రభాస్ శ్రీను

Google News