Adipurush: ‘ఆదిపురుష్’ కీలక పాత్రధారులు ఎంతెంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలిస్తే..

Adipurush: ‘ఆదిపురుష్’ కీలక పాత్రధారులు ఎంతెంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలిస్తే..

ఆదిపురుష్(Adipurush) మూవీ మరికొన్ని గంటల్లో థియేటర్స్‌లో సందడి చేయనుంది. ఈ సినిమా కోసం ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ఫ్యాన్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఓం రౌత్(Om Raut) దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ సంచలనం సృష్టించబోతోందని టాక్ నడుస్తోంది. ప్రభాస్ తన కెరీర్లో మొదటిసారిగా ఒక పౌరాణిక సినిమాలో నటిస్తుండటం విశేషం. రాముని పాత్రలో ప్రభాస్.. సీత పాత్రలో కృతి సనన్ నటించారు.

ఒక్క ప్రభాస్(Prabhas) మినహా సినిమాలో కీలక పాత్రలన్నింటికీ బాలీవుడ్ స్టార్స్‌ను చిత్ర యూనిట్ తీసుకుంది. రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan), లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్‌(Sunny Singh)ను తీసుకున్నారు. రూ.500 కోట్లతో రూపొందించిన ఈ భారీ బడ్జెట్ మూవీలో నటీనటుల రెమ్యూనరేషన్ కోసం బాగా ఖర్చు చేశారని సమాచారం. ఈ సినిమాలో చేసిన కొందరు నటులైతే తమ కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్నారని సమాచారం.

Adipurush Actors Remunarations

ముందుగా ప్రభాస్.. 100 నుంచి 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. ఇక సీత పాత్ర చేసిన కృతి(Kriti Sanon) రూ.3 కోట్లు.. అంటే తను రెగ్యులర్‌గా తీసుకునే దాని కంటే కోటి రూపాయలు ఎక్కువ. లక్ష్మణుడు పాత్ర చేసిన సన్నీ సింగ్ తన కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్ రూ.1.5 కోట్లు తీసుకున్నారట. ఇక రావణుడి పాత్రలో నటించిన సైఫ్ అలీ ఖాన్ రూ.12 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారని టాక్. ఇప్పుడు వీరి రెమ్యూనరేషన్ల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.

Google News