Allu Arjun: అల్లు అర్జున్ రాకతో జనసంద్రంగా మారిన అమీర్‌పేట్..

Allu Arjun: బన్నీ రాకతో జనసంద్రంగా మారిన అమీర్‌పేట్..

ఈ రోజుల్లో స్టార్స్ అంతా కూడా ఒకవేళ ఇండస్ట్రీలో తమ హవా తగ్గిపోయినా కూడా ప్రత్యామ్నాయ మార్గాలను వెదుక్కొంటున్నారు. కొందరు రెస్టారెంట్లు నడిపిస్తుంటే మరికొందరు లగ్జరీ సినిమా థియేటర్లను నడిపిస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఏఎంబీ పేరుతో అత్యాధునిక సినిమా హాల్‌ను నడిపిస్తున్నారు. ఇక ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) వంతు. నేడు ఆయన అత్యాధునిక సినిమా హాల్‌ను ఓపెన్ చేశాడు.

హైదరాబాద్‌లో అమీర్ పేట(Ameerpet) అనగానే.. ముందుగా మనకు గుర్తొచ్చేది సత్యం థియేటర్. ఈ థియేటర్‌తో హైదరాబాద్ ప్రజలకు కొన్ని దశాబ్దాల అనుబంధం ఉంది. హైదరాబాదీయులకు సుపరిచితమైన సత్యం థియేటర్‌ను పడగొట్టేసి.. దాని స్థానంలో అత్యాధునిక భారీ మల్టీఫ్లెక్స్ ను ‘AAA’ పేరుతో బన్నీ నిర్మించాడు. ఈ థియేటర్ నిజానికి ఓ అద్భుతమే. ఈ థియేటర్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్.. తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లు కలిసి ప్రారంభించారు.

Allu Arjun: బన్నీ రాకతో జనసంద్రంగా మారిన అమీర్‌పేట్..

థియేటర్ ఓపెనింగ్ కోసం వచ్చిన బన్నీని చూసేందుకు ఆయన అభిమానులు పోటెత్తారు. ఉదయం నుంచే అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. ఓపెన్ టాప్ జీపులో బన్నీ అక్కడకు వచ్చాడు. బన్నీ రాకతో అమీర్‌పేట మొత్తం జనసందోహంగా మారింది. అటుగా వచ్చిన వాహన దారులు తీవ్రంగా ట్రాఫిక్ జాం కావడంతో నానా ఇబ్బందులు పడ్డారు. ఇక ఈ థియేటర్‌లో తొలి సినిమాగా ‘ఆదిపురుష్’(Adipurush)ను ప్రదర్శించనున్నారు.

ఇవీ చదవండి:

‘ఆదిపురుష్’ కీలక పాత్రధారులు ఎంతెంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలిస్తే..

రౌడీ హీరోతో రొమాన్స్‌కి ఆ హీరోయిన్ సిద్ధమైందట..

తల్లితో సమానమైన ఆమెతో అఫైర్స్ అంటగట్టకండి: ప్రభాస్ శ్రీను

Google News