Adipurush Twitter Talk: ‘ఆదిపురుష్’ ట్విటర్ టాక్ ఎలా ఉందంటే..

Adipurush Twitter Talk: ‘ఆదిపురుష్’ ట్విటర్ టాక్ ఎలా ఉందంటే..

Adipurush Twitter Talk:

ప్రభాస్ ఫ్యాన్స్, మూవీ లవర్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన ‘ఆదిపురుష్’(Adipurush) మూవీ నేడు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేస్తోంది. ప్రభాస్(Prabhas) రాముడిగానూ.. కృతి సనన్(Kriti Sanon) సీతగా నటించిన ఈ సినిమాకు ఓం రౌత్(Om Raut) దర్శకత్వం వహించారు. ఆరు వేల థియేటర్లలో నేడు ఈ మూవీ విడుదల అయ్యింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆదిపురుష్ మానియా నడుస్తోంది. ఇప్పటికే ఫస్టాఫ్ పడిపోయింది. ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులు ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

విజువల్స్ పరంగా అయితే సినిమా అద్భుతంగా ఉందని ప్రేక్షకులు అంటున్నారు. విజువల్స్ అసలు మన ఊహకందవని విజువల్స్. ఇక రాముడిగా ప్రభాస్(Prabhas).. అద్భుతమని చెబుతున్నారు. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో హైలైట్ అట. ఫస్ట్ హాఫ్ అయితే బాగుందని ఎక్కువమంది ప్రేక్షకులు అంటున్నారు. యాక్షన్ సన్నివేశాల విషయానికి వస్తే వీఎఫ్ఎక్స్ సో సోగా ఉన్నాయట. ఫైటింగ్ సీన్స్ మాత్రం ఆకట్టుకుంటున్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు.

Adipurush Twitter Talk: ‘ఆదిపురుష్’ ట్విటర్ టాక్ ఎలా ఉందంటే..

ఇక శ్రీరాముడి కథ చెప్పిన విధానం బాగుందని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డాడు. విజువల్ గ్రాండియర్‌గా ఉందని ఓ నెటిజన్ తెలిపాడు. ప్రభాస్(Prabhas) ఫ్యాన్స్‌కి మాత్రం ఈ మూవీ చాలా డిజప్పాయింటింగ్‌గా ఉంటుందని అంటున్నారు. దీనికి కారణం.. మిగతా క్యారెక్టర్స్‌కి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇవ్వడంతో తెరపై ప్రభాస్ చాలా తక్కువ సమయం కనిపించారట. మొత్తంగా చెప్పాలంటే.. నేటి తరం ఆలోచనలకు తగ్గట్టుగా ఓం రౌత్ విఫలం అయ్యారని టాక్.

ఇవీ చదవండి:

‘ఆదిపురుష్’ కీలక పాత్రధారులు ఎంతెంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలిస్తే..

పుట్టిబోయే బిడ్డ కోసం ఉపాసన కీలక నిర్ణయం.. అదేంటో తెలిస్తే..

మరోసారి సర్జరీ కోసం యూఎస్‌కు వెళ్లిన ప్రభాస్..!

తల్లితో సమానమైన ఆమెతో అఫైర్స్ అంటగట్టకండి: ప్రభాస్ శ్రీను

Google News