Prabhas: మరోసారి సర్జరీ కోసం యూఎస్‌కు వెళ్లిన ప్రభాస్..!

Prabhas: మరోసారి సర్జరీ కోసం యూఎస్‌కు వెళ్లిన ప్రభాస్..!

బాహుబలి(Baahubali) మూవీతో స్టార్ హీరో ప్రభాస్(Prabhas) రేంజే మారిపోయింది. ఇండియాలోనే ఏ హీరో చేయని విధంగా వరుసబెట్టి పాన్ ఇండియా మూవీస్ చేస్తూ దూసుకుపోతున్నాడు. మరోనాలుగు రోజుల్లో ‘ఆదిపురుష్’(Adipurush) మూవీతో థియేటర్లలో ప్రభాస్ సందడి చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్లలో చిత్ర యూనిట్ బిజీ బిజీగా ఉంది. ఈ తరుణంలో ప్రభాస్(Prabhas) అమెరికా వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

అయితే ప్రభాస్(Prabhas) యూఎస్‌కి వెళ్లడంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఒకటేంటంటే.. యూఎస్‌లో సినిమాకు థియేటర్స్ తక్కువగా కేటాయించడం.. ఆపై అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన రీతిలో జరగకపోవడం వంటి కారణాల వలన ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగానే ప్రభాస్ యూఎస్ వెళ్లాడని ఒక కథనం వినిపిస్తోంది. మరోటేంటంటే.. ప్రభాస్(Prabhas) మోకాలికి మరోసారి వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించున్నారట.

Prabhas: మరోసారి సర్జరీ కోసం యూఎస్‌కు వెళ్లిన ప్రభాస్..!

ప్రభాస్ గత కొంత కాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. అయితే ఇప్పటికే ఆయనకు వైద్యులు మోకాలి శస్త్ర చికిత్స నిర్వహించారు. అయితే ఇప్పుడు అది మళ్లీ తిరగబెట్టిందట. దీంతో ప్రభాస్(Prabhas) యూఎస్ వెళ్లారని ఫిలింనగర్ టాక్.

అయితే ప్రభాస్ శస్త్ర చికిత్స విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయినా కూడా ప్రభాస్ టీం ఈ విషయంపై స్పందించడం లేదు. దీంతో శస్త్ర చికిత్స నిజమేనన్న వార్తలకు బలం చేకూరుతోంది.

Google News