Upasana Konidela: ఉపాసన డెలివరీకి టైమ్ ఫిక్స్..!

Upasana Konidela: ఉపాసన డెలివరీకి టైమ్ ఫిక్స్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌(Ram Charan)కి ఈ మధ్య కాలం బాగా కలిసొస్తోంది. ఎప్పటి నుంచో మెగా వారసుడి కోసం ఆ కుటుంబమే కాకుండా ఫ్యాన్స్ అంతా తెగ ఎదురు చూస్తున్నారు. అసలు చెర్రీ(Ram Charan) ఏ ఇంటర్వ్యూకి వెళ్లినా.. ఆయన సతీమణి ఉపాసన(Upasana Konidela) ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్నా వీరిని అడిగే మొదటి విషయం పిల్లల గురించే కావడం గమనార్హం. పెళ్లై పదేళ్లు దాటుతున్నా పిల్లలు లేకపోవడంతో సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ వచ్చాయి.

ఇక మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) మరోసారి తాతను కాబోతున్నానన్న విషయం వెల్లడించి అందరినీ ఫుల్ ఖుషీ చేసేశారు. ఇక ఆ తరువాత రామ్ చరణ్‌కి అంతా మంచే జరుగుతోంది. ‘ఆర్ఆర్ఆర్’(RRR) బ్లాక్ బస్టర్ హిట్ సాధించడం.. ఆపై ఆస్కార్ అందుకోవడం.. వరల్డ్ వైడ్ పాపులారిటీ రావడం చకచకా జరిగిపోయాయి. ఇక ఇప్పుడు మిగిలి ఉన్న క్వశ్చన్ ఉపాసన(Upasana Delivery) డెలివరీ ఎప్పుడు? మెగా వారసుడిని ఎప్పుడు చూడాలి? అనే ఆత్రుత జనాల్లో బాగా పెరిగిపోయింది.

Upasana Konidela: ఉపాసన డెలివరీకి టైమ్ ఫిక్స్..!

మెగా వారసుడి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్ రానే వచ్చింది. ఉపాసన(Upasana Konidela) డెలివరీ ఎప్పుడనేది తెలిసిపోయింది. వచ్చే నెలలోనే ఉపాసన డెలివరీ ఉండబోతోందట. అయితే ఉపాసన డెలివరీ అపోలోలోనే జరగనుంది. తొలుత అమెరికాలో అని భావించినప్పటికీ తాను అపోలోలోనే డెలివరీ అవుతానని ఉపాసన చెప్పడంతో అంతా ఓకే అన్నారట. అత్యుత్తమ గైనకాలజిస్టుల పర్యవేక్షణలో ఉపాసన డెలివరీ ఉండబోతోందట.

Google News