Avika Gor: 7 సార్లు పెళ్లైందని చెప్పి షాకిచ్చిన అవికా గోర్

Avika Gor: 7 సార్లు పెళ్లైందని చెప్పి షాకిచ్చిన అవికా గోర్

అవికాగోర్(Avika Gor) అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది చిన్నారి పెళ్లికూతురు సీరియల్. ఈ ముద్దుగుమ్మకు మాంచి నేమ్, ఫేమ్ తెచ్చిపెట్టిన సీరియల్. ఆ తరువాత కూడా పలు సీరియళ్లలో ఆమె నటించింది. అంతేకాదు.. ఈ సీరియల్ అమ్మడికి వెండితెరపై కూడా అవకాశాలను కల్పించింది. తెలుగులో ఉయ్యాలా జంపాలా(Uyyala Jampala) చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. నాగార్జున(Nagarjuna) నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం 2014లో విడుదలై సూపర్ హిట్ కొట్టింది.

పల్లెటూరి అమాయక యువతి పాత్రలో అవికా(Avika Gor) మెప్పించింది. అయితే తాజాగా అవికా తాను నటించిన సీరియల్స్, సినిమాల గురించి అవికా ఆసక్తికర కామెంట్స్ చేసింది. తనకు ఇప్పటి వరకూ మొత్తంగా ఏడు సార్లు పెళ్లి అయ్యిందని వివరించింది. అయితే రియల్ లైఫ్‌లో కాదులెండి. రీల్ లైఫ్‌లోనే. మూడుసార్లు హీరోతో మరో నాలుగు సార్లు ఇతర క్యారెక్టర్స్ తో పెళ్లి చేశారని అవికా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

అంతేకాదు.. తను మూడుసార్లు చనిపోయి బ్రతికినట్లు చూపించారని.. అలాగే ఆత్మలతో మాట్లాడుతున్నట్లు చూపించారని అవికా(Avika Gor) ఓ తెలిపింది. ఆ సీన్స్ తలచుకుంటే ఇప్పటికీ నవ్వు వస్తుందని అవికా వెల్లడించింది. ప్రస్తుతం అవికా తెలుగులో రెండు సినిమాలు.. అలాగే ఒక హిందీ చిత్రంలో నటిస్తోంది. ఇక అవికా నటించిన హిందీ చిత్రం 1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్ మూవీ జూన్ 23న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగానే ఎడాపెడా ఇంటర్వ్యూలు ఇచ్చేస్తోంది.

Google News