Thaman Wife: భర్తపై వస్తున్న ట్రోల్స్ గురించి తమన్ భార్య ఏమన్నారంటే..

Thaman Wife: భర్తపై వస్తున్న ట్రోల్స్ గురించి తమన్ భార్య ఏమన్నారంటే..

సౌత్ ఇండియాలో టాప్ డైరెక్టర్ ఎవరంటే.. అందరి నుంచి ఒకటే ఆన్సర్ వస్తుంది.. అది తమన్(Thaman) అని. అన్ని హిట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరోకు ఆయనే మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. తమన్(Thaman) కూడా ప్రస్తుతం అటు వెండితెరపై ఇటు బుల్లితెరపై సందడి చేస్తున్నారు. సినిమాలకు సంగీతం అందిస్తూనే.. ఇండియన్‌ తెలుగు ఐడల్‌ షోకు జడ్జిగా వ్వవహరిస్తున్నారు.

ఇక తమన్‌(Thaman)కు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంత పేరుందో.. కాపీ క్యాట్‌గా కూడా అంతే పేరుంది. ఏ పాట వచ్చినా కూడా దాని వెంటే ఆయనకు విమర్శలు కూడా సర్వసాధారణంగానే వస్తుంటాయి. తాజాగా ఆయనపై వస్తున్న ట్రోల్స్‌పై ఆయన భార్య వర్ధిని(Thaman wife Vardhini) స్పందించారు. ఆమె ఒక ప్లే బ్యాక్ సింగర్. ఈ విషయాన్ని ‘సర్కారు వారి పాట’ సినిమా ప్రమోషన్స్‌లో తమన్ వెల్లడించారు.

తాజాగా వర్దిని(Thaman wife Vardhini) ఓ ఇంటర్వ్యూలో తమన్‌పై వస్తున్న ట్రోల్స్‌పై మాట్లాడుతూ.. తాము ఇంట్లో ఎప్పుడూ ట్రోల్స్ గురించి మాట్లాడుకోమని చెప్పారు. తమన్ ఇంటర్వ్యూలు మాత్రమే చూస్తానని.. దాని కింద వచ్చిన కామెంట్స్ మాత్రం చదవనని వెల్లడించారు. తాను చాలా సెన్సిటివ్‌గా ఆలోచిస్తానని.. ఆ ట్రోల్స్ చదివితే తనకు చాలా బాధగా అనిపిస్తుందని వర్ధిని వెల్లడించారు. ఇక తమన్‌ను అభిమానించే వారికి వర్థిని థ్యాంక్స్ చెప్పారు.

Google News