NTR: 30 సెకన్స్ నిడివి గల ఈ యాడ్‌కి ఎన్టీఆర్ ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలిస్తే..

NTR: 30 సెకన్స్ నిడివి గల ఈ యాడ్‌కి ఎన్టీఆర్ ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలిస్తే..

ఇటీవలి కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోలు రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఒకవైపు సినిమాలు మరోవైపు యాడ్స్‌తో అదరగొట్టేస్తున్నారు. పాన్ ఇండియా మార్కెట్‌లోకి అడుగు పెట్టకున్నా కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) అందరికంటే ఈ యాడ్స్ రేసులో ముందున్నాడు. విపరీతంగా సంపాదించేస్తున్నాడు. ఇక ఇటీవలి కాలంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) కూడా యాడ్స్‌లో బాగానే కనిపిస్తున్నాడు.

ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’(RRR) చిత్రంతో పాన్ వరల్డ్ రేంజ్‌లో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక దీంతో అటు టాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీల నుంచి దర్శక నిర్మాతలు ఇటు.. యాడ్ కంపెనీలు ఎన్టీఆర్ కోసం క్యూ కట్టేస్తున్నాయి. ఇక నేషనల్ వైడ్‌గా ఫేమస్ అయిన ఫుడ్ సంస్థ మెక్ డొనాల్డ్స్(MC Donalds). ఈ కంపెనీ తమ ప్రొడక్ట్స్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్టీఆర్‌(NTR)ను ఎంచుకుంది.

NTR: 30 సెకన్స్ నిడివి గల ఈ యాడ్‌కి ఎన్టీఆర్ ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలిస్తే..

రీసెంట్‌గా మెక్ డొనాల్డ్స్‌(MC Donalds)కి సంబంధించిన యాడ్ ప్రసారం అయ్యింది. దీనికి ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే.. ఈ యాడ్‌కి ఎన్టీఆర్(NTR) ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు? నిజానికి మైండ్ బ్లాక్ అయ్యే రెమ్యూనరేషనే తీసుకున్నాడని టాక్. కేవలం 30 సెకన్ల నిడివి గల మెక్ డొనాల్డ్స్(MC Donalds) యాడ్ కోసం ఎన్టీఆర్ రూ.8 కోట్లకు పైనే రెమ్యూనరరేషన్ తీసుకున్నాడట.

Google News