Balakrishna Fans: ఎన్టీఆర్‌పై రాళ్లు.. రామ్ చరణ్‌పై ప్రశంసలు కురిపిస్తున్న బాలయ్య ఫ్యాన్స్

Balakrishna Fans: ఎన్టీఆర్‌పై రాళ్లు.. రామ్ చరణ్‌పై ప్రశంసలు కురిపిస్తున్న బాలయ్య ఫ్యాన్స్

నటరత్న నందమూరి బాలకృష్ణ(Balakrishna) అభిమానులకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తెగ నచ్చేశాడు. ఏకంగా ప్రశంసల వర్షాన్నే కురిపిస్తున్నారు. మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌(NTR)పై సోషల్ మీడియా వేదికగా రాళ్లు వేస్తున్నారు. నిజానికి మెగా, నందమూరి ఫ్యాన్స్‌కి పెద్దగా పడదు. హీరోలంతా బాగానే ఉన్నా కూడా ఫ్యాన్స్ మాత్రం ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వార్ నడిపిస్తూనే ఉంటారు.

ఇక తాజాగా బాలయ్య ఫ్యాన్స్ రామ్ చరణ్‌(Ram Cahran)ని తెగ పొగిడేస్తున్నారు. బాలయ్య – చెర్రీలను బాబాయ్ – అబ్బాయ్ అని సంబోధిస్తూ మరీ ప్రేమ కురిపించేస్తున్నారు. తాజాగా ప్రముఖ హీరో శర్వానంద్(Sharwanand) వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమంలో బాలయ్యను చూసి చెర్రీ విష్ చేసిన తీరు.. ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. బాలయ్య(Balakrishna)కు చెర్రీ నమస్కరించడం.. చేతులు పట్టుకుని వినయంగా మాట్లాడటం ఆకట్టుకున్నాయి.

Balakrishna Fans: ఎన్టీఆర్‌పై రాళ్లు.. రామ్ చరణ్‌పై ప్రశంసలు కురిపిస్తున్న బాలయ్య ఫ్యాన్స్

నిన్న బాలయ్య బర్త్ డే సందర్భంగా మెయిన్‌గా చెర్రీ పలకరించిన దానికి సంబంధించిన వీడియోను అభిమానులు విపరీతంగా వైరల్ చేశారు. మరోవైపు ఎన్టీఆర్‌పై మండిపడుతున్నారు. నిజమైన అభిమానం అంటే ఇలా ఉంటుందని.. సొంత కుటుంబ ఫంక్షన్స్‌కి హాజరవకుండా బర్త్ డే సెలబ్రేషన్స్‌కి ప్రాధాన్యమిచ్చేవారికి బంధాల విలువ ఏం తెలుస్తుందంటూ ఏకి పారేస్తున్నారు. ఎన్టీఆర్(NTR) శత జయంతి వేడుకలకు ఎన్టీఆర్ డుమ్మా కొట్టినప్పటి నుంచి బాలయ్య ఫ్యాన్స్‌ ఆయనపై మండిపడుతున్నారు.

Google News