Sharwanand Reception: శర్వా రిసెప్షన్‌లో అందరి దృష్టినీ ఆకర్షించిన బాలయ్య, రామ్ చరణ్
శర్వానంద్ పెళ్లి రిసెప్షన్ (Sharwanand Wedding Reception) కార్యక్రమంలో దాదాపు టాలీవుడ్ మొత్తం హాజరైంది. ప్రముఖులంతా వచ్చి సందడి చేశారు. ఇక శర్వానంద్(Sharwanand) పెళ్లి పెద్ద, మంచి స్నేహితుడు అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తన భార్యతో కలిసి ఈ వేడుకకు హాజరయ్యాడు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు అందజేశారు. శర్వాతో ఫోటో దిగి ఆ తర్వాత కొద్ది సేపు సరదాగా ముచ్చటిండచాడు. అంతేకాదు.. శర్వా మెడకు ఉన్న టైని సరి చేసి అందరి దృష్టిని రామ్ చరణ్ ఆకర్షించాడు.
ఇదిలా ఉండగా.. శర్వా పెళ్లి రిసెప్షన్‌తో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. శర్వా, చెర్రీలు సరదాగా ముచ్చటించుకుంటున్న సమయంలో అక్కడికి నందమూరి బాలకృష్ణ(Balakrishna) వచ్చారు. బాలయ్యను చూడగానే రామ్ చరణ్ మర్యాదపూర్వకంగా నమస్కరించాడు. వెంటనే బాలయ్య బాగున్నావా? అంటూ చెర్రీని ఆప్యాయంగా పలకరించారు. చెర్రీ బాగున్నానంటూ సమాధానం ఇచ్చాడు. చెర్రీ వీపుపై సుతి మెత్తగా కొట్టి బాలయ్య నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
బాలయ్య, చెర్రీలను అక్కడి చూసిన వారంతా ఆసక్తిగా తిలకించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక ఈ వీడియోను చూసిన ఇద్దరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. గతంలో కూడా ప్రభాస్.. బాలయ్య షోకి వెళ్లినప్పుడు చెర్రీతో కాల్ మాట్లాడటం అందరినీ ఆకర్షించింది. ఇప్పుడు స్వయంగా ఎదురుపడటం.. ఆప్యాయంగా పలకరించుకోవడం ఆసక్తికరంగా మారింది.