Varun Tej – Lavanya Tripathi: వరుణ్ తేజ్, లావణ్యలలో ముందుగా ఎవరు లవ్‌ను ప్రపోజ్ చేశారంటే..

Varun Tej - Lavanya Tripathi: వరుణ్ తేజ్, లావణ్యలలో ముందుగా ఎవరు లవ్‌ను ప్రపోజ్ చేశారంటే..

లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) మెగా కోడలు కావడం ఊహించి ఊహించని పరిణామం. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej), లావణ్య(Lavanya Tripathi)ల మధ్య ఏదో జరుగుతోందని గుసగుసలు అయితే వచ్చాయి కానీ అది నిజమా? కాదా? అనే సందిగ్ధంలోనే అంతా ఉండిపోయారు. సడెన్‌గా పెళ్లి వార్త అధికారికంగా పెళ్లి ప్రకటన రావడంతో అంతా అవాక్కయ్యారు. నిన్న అంటే జూన్ 9న మణికొండలోని నాగబాబు నివాసంలో వరుణ్ తేజ్, లావణ్య(Varun Tej – Lavanya Tripathi)ల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే ఆహ్వానం జరిగింది.

అసలు వరుణ్-లావణ్య(Varun Tej – Lavanya Tripathi)ల ప్రేమ కహాని ఎక్కడ మొదలైందనేది కూడా కేవలం ఊహాగానాలే కానీ ఎవరికి పెద్దగా తెలియదు. దీంతో వారిద్దరి లవ్ స్టోరీ ఎక్కడ మొదలైంది. మొదట ఎవరు ప్రపోజ్ చేశారు? వంటి విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. 2017లో దర్శకుడు శ్రీను వైట్ల మిస్టర్ అనే టైటిల్‌తో వరుణ్ తేజ్ హీరోగా ఒక మూవీ రూపొందిన విషయం తెలిసిందే. దీనిలో వరుణ్ తే లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ హీరోయిన్స్‌గా నటించారు.

Varun Tej - Lavanya Tripathi: వరుణ్ తేజ్, లావణ్యలలో ముందుగా ఎవరు లవ్‌ను ప్రపోజ్ చేశారంటే..

నిజానికి మిస్టర్ మూవీ(Mister Movie) అట్టర్ ఫ్లాప్. కానీ వరుణ్, లావణ్యల లవ్ స్టోరీకి మాత్రం బీజం పడింది ఈ మూవీతోనేనని సమాచారం. షూటింగ్‌లో భాగంగా లావణ్య(Lavanya Tripathi)తో మొదలైన స్నేహం ప్రేమగా మారేందుకు పెద్దగా టైం పట్టలేదని టాక్ నడుస్తోంది. అయితే వీరిద్దరి మధ్య లవ్ ప్రపోజల్స్ వంటివి అయితే ఏమీ లేవని సమాచారం. ఒకరోజు వరుణ్ తేజ్ నేరుగా లావణ్యను పెళ్లి చేసుకుందామా? అని అడిగాడట. అప్పటికే వరుణ్ అంటే ప్రేమ చూపిస్తున్న లావణ్య వెంటనే ఓకే చెప్పేసిందట. అదీ కథ.

Google News