Lavanya Tripati: లావణ్య బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? వరుణ్ తేజ్‌లో ప్రేమకు ఎక్కడ బీజం పడింది?

Lavanya Tripati: లావణ్య బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? వరుణ్ తేజ్‌లో ప్రేమకు ఎక్కడ బీజం పడింది?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి (Varun Tej – Lavanya Tripati)ల లవ్ స్టోరీ గురించి ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. కానీ అప్పట్లో కొట్టిపడేసిన మెగా ఫ్యామిలీ ఎట్టకేలకు వారి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తానికి ఈ ప్రేమ జంట పెద్ద సమక్షంలో పెళ్లిపీటలు ఎక్కబోతోంది. మెగా వారసుడి గురించి అందరికీ తెలిసిందే. మరి లావణ్య(Lavanya Tripati) గురించి? చాలా తక్కువ మందికే తెలుసు. మరి వీరిద్దరి ప్రేమ ఎప్పుడు మొదలైంది? అనే విషయం కూడా పెద్దగా ఎవరికీ తెలియదు.

లావణ్య త్రిపాఠి(Lavanya Tripati) జన్మించింది అయితే ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య. కానీ పెరిగింది మాత్రం ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో. ఆమె తండ్రి వచ్చేసి హైకోర్టు న్యాయవాది కాగా.. తల్లి రిటైర్డ్ టీచర్. లావణ్య(Lavanya Tripati)కు ఒక చెల్లి, తమ్ముడు ఉన్నారు. మార్సల్స్ స్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని.. ముంబైకి వెళ్లింది. అక్కడ రిషి దయారాం నేషనల్ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో పట్టా పుచ్చుకుంది. అయితే ఆమెకు చిన్నప్పటి నుంచి సినీ ఇండస్ట్రీలో రాణించాలనేది ఆమె కోరిక.

Lavanya Tripati: లావణ్య బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? వరుణ్ తేజ్‌లో ప్రేమకు ఎక్కడ బీజం పడింది?

2006లో మిస్ ఉత్తరాఖండ్‌గా లావణ్య(Lavanya Tripati) నిలిచింది. చదువు పూర్తైన వెంటనే మోడలింగ్ చేసి తొలుత బుల్లితెరపై లావణ్య దర్శనమిచ్చింది. 2012లో ‘అందాల రాక్షసి’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె కెరీర్‌లో హిట్స్ అయితే చాలా తక్కువ అనే చెప్పాలి. అవకాశాలైతే వచ్చాయి కానీ ఎందుకో స్టార్ హోదాను మాత్రం అందుకోలేకపోయింది. ఇక ‘మిస్టర్’(Mister), ‘అంతరిక్షం’(Anthariksham) సినిమాల్లో వరుణ్ తేజ్(Varun Tej), లావణ్య త్రిపాఠి(Lavanya Tripati) జంటగా నటించారు. మిస్టర్ సినిమాతో మొదలైన వీరి స్నేహం ఆ తరువాత ప్రేమగా మారింది.

Google News