Harish Shankar: ఇక మీదట పవన్ షూటింగ్‌లన్నీ అక్కడేనట.. ప్రకటించిన హరీష్ శంకర్

Harish Shankar: ఇక మీదట పవన్ షూటింగ్‌లన్నీ అక్కడేనట.. ప్రకటించిన హరీష్ శంకర్

ఏపీలో ఎన్నికల తరుణం రానే వచ్చింది. ఈ సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. అటు సినిమాలు.. ఇటు రాజకీయాలు.. రెండూ కీలకమే. రెండింటినీ సమన్వయం చేయడం చాలా కష్టం. అందుకే చాలా మంది సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నారు.

పవన్ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలున్నాయి. ‘బ్రో ది అవతార్’(Bro The Avatar) మూవీ షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం OG , ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) మరియు హరి హర వీరమల్లు (Hari Hara Veeramallu) సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ఇక మరోవైపు పవన్ వారాహి యాత్రను సంకల్పించారు. ఇప్పుడు ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడమనేది కత్తి మీద సాము లాంటిదే. జూన్ 14 నుంచి వారాహి యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్ర ప్రారంభానికి ముందు పవన్ మహాయాగాన్ని నిర్వహిస్తున్నారు.

Harish Shankar: ఇక మీదట పవన్ షూటింగ్‌లన్నీ అక్కడేనట.. ప్రకటించిన హరీష్ శంకర్

ఇక ఈ యాగానికి సినీ ప్రముఖులంతా హాజరై సందడి చేస్తున్నారు. ఇక ఇప్పుడు పవన్ ఏపీని వదిలి రావడానికి వీలు పడదు. ఈ క్రమంలోనే పవన్ షూటింగ్స్‌పై తాజాగా హరీష్ శంకర్(Harish Shankar) ఒక కీలక ప్రకటన చేశారు. మంగళగిరి ప్రాంతం షూటింగులకు అనుకూలంగా ఉందని.. పవన్ కల్యాణ్ ఇకపై మంగళగిరిలో ఉండబోతున్నారు కాబట్టి ఆయన తన సినిమా షూటింగే కాకుండా.. ఇతర సినిమాల షూటింగులను ఇక్కడ కూడా నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు.

ఇప్పటికే ఈ విషయంపై దర్శక, నిర్మాతలతో మాట్లాడామన్నారు. త్వరలోనే విజయవాడ పరిసర ప్రాంతాల్లో షూటింగులు జరగబోతున్నాయని హరీష్ శంకర్ తెలిపారు.

Google News