NBK109: బాలయ్య 109 స్టోరీ ఇదేనట..

NBK109: బాలయ్య 109 స్టోరీ ఇదేనట..

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఇటీవలి కాలంలో ఫుల్ జోష్ మీదున్నారు. ఏడాదికి ఒక సినిమాతో ఫినిష్ చేసే బాలయ్య.. ప్రస్తుతం కుర్ర హీరోలకు పోటీనిస్తూ ఈ ఏడాది రెండు చిత్రాలతో కనువిందు చేయనున్నారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వీరసింహారెడ్డి(Veera Simha Reddy) చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. ఇక మరో సినిమాను దసరా బరిలో నిలపబోతున్నారు. అదే ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari). మాంచి పవర్‌ఫుల్ టైటిల్‌ కదా. ఫ్యాన్స్‌కి అయితే తెగ నచ్చేసింది.

2023లో బాలయ్య రెండు సినిమాలను అనౌన్స్ చేశారు. ఈ రెండు సినిమాలతో కలిపి ఈ ఏడాది మూడు సినిమాలు కానున్నాయి. భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సెట్స్‌పై ఉండగానే దర్శకుడు బాబీ(Bobby)తో కలిసి కొత్త సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలను జరుపుకుంది. బాలయ్య 109వ చిత్రంగా ఇది తెరకెక్కనుంది. ఇక అదే రోజున ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్‌ని కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది.

NBK 109 story

ఈ కాన్సెప్ట్ పోస్టర్‌ని చూసి ఫ్యాన్స్ మూవీ స్టోరీని సైతం అల్లేసుకుంటున్నారు. ఓ పురాతన పెట్టెలో మ్యాన్షన్ హౌస్ ఫుల్, సిగరెట్ ప్యాకెట్, డబ్బులతో పాటు మారణ ఆయుధాలు ఉన్నాయి. దీనిపై ఒక అద్భుతమైన క్యాప్షన్ రాసి ఉంది. ‘ప్రపంచానికి అతడు తెలుసు.. అతడి ప్రపంచమే ఎవరికీ తెలియదు’ అని క్యాప్షన్ ఇచ్చారు. దీన్ని బట్టి బాలయ్య క్యారెక్టర్‌లో రెండు షేడ్స్ ఉన్నాయని.. అజ్ఞాతంలో ఉన్న బాలయ్య.. అన్యాయాన్ని ఎదురించడం కోసం ఎదురు చూస్తుంటాడని.. కానీ ఏవో కారణాల వల్ల సాధారణ జనాలతో కలిసి వారితో మమేకమై జీవిస్తూ ఉంటాడట. ఆయన ఫ్లాష్‌బ్యాక్ ఒకానొక సందర్భంలో జనాలకు తెలియడం.. ఆ తరువాత జరిగే కథ ఆధారంగా సినిమా ఉంటుందట. మరి ఈ స్టోరీ ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.

Google News