Vijay Deverakonda: రౌడీ హీరోతో రొమాన్స్‌కి ఆ హీరోయిన్ సిద్ధమైందట..

Vijay Deverakonda: రౌడీ హీరోతో రొమాన్స్‌కి ఆ హీరోయిన్ సిద్ధమైందట..

వరుస ఫ్లాపులు పడుతున్నా రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఫ్యాన్స్ అండ కాపాడుతోందో మరొకటో కానీ లైగర్ డిజాస్టర్ నుంచి కోలుకుని తక్షణమే ఖుషి సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు. లైగర్‌తో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలనుకున్న విజయ్ కోరిక ఫలించకపోవడంతో.. ఇప్పుడు ఖుషి మూవీతో మరో ట్రయల్ అయితే మొదలు పెట్టాడు. మరి ఈ సినిమా కలిసొస్తుందో లేదో చూడాలి.

ఇక విజయ్ దేవరకొండ(Vijay Deverakonda).. ఖుషి(Kushi) తర్వాత రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అందులో గీతా గోవిందం డైరెక్టర్ పరుశురాంతో చేయనున్న సినిమా ఒకటి. పరుశురాంతో ఇది రెండో సినిమా కావడం విశేషం. అంతకు ముందు పరుశురాంతో కలిసి విజయ్.. గీత గోవిందం సినిమా చేసిన విషయం తెలిసిందే. ఇది బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఈ దెబ్బకు ఫస్ట్ టైమ్ రూ.100 కోట్ల కలెక్షన్ క్లబ్‌లో చేరిపోయాడు.

Mrunal Thakur

ఇక మళ్లీ విజయ్(Vijay Deverakonda), పరుశురాం(Parasuram) కాంబో అంటే ఎలా ఉంటుంది? ప్రకటించి ప్రకటించక ముందే అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇక పరుశురాం సినిమా అంటే సాధారణంగా హీరోయిన్స్‌కు పెద్ద పీట వేసేస్తారు. అయితే ఈ సినిమాలో తొలుత రష్మిక(Rashmika Mandanna) హీరోయిన్ అనుకున్నారు. ఆ తర్వాత పూజాహెగ్డే అన్నారు. ఇప్పుడు మృణాల్ ఠాకూర్ పేరు గట్టిగా వినిపిస్తోంది. చర్చలు, ఓకే చెప్పడాలు కూడా పూర్తయ్యాయట. మొత్తానికి రౌడీ హీరోతో మృణాల్(Mrunal Thakur) రొమాన్స్‌కి సిద్ధమైపోయిందట.

Google News