Prabhas Sreenu: తల్లితో సమానమైన ఆమెతో అఫైర్స్ అంటగట్టకండి: ప్రభాస్ శ్రీను

Prabhas Sreenu: తల్లితో సమానమైన ఆమెతో అఫైర్స్ అంటగట్టకండి: ప్రభాస్ శ్రీను

సినీ ఇండస్ట్రీ అంటేనే ఒక రోత అనే భ్రమలో ఉంటాం. ఎవరైనా ఆడ, మగ కాస్త మంచిగా ఉంటే చాలు సంబంధం అంటగట్టేసి సోషల్ మీడియాలో చెత్త చెత్త చేసేస్తున్నారు. ఈ క్రమంలోనే కమెడియన్ ప్రభాస్ శ్రీను(Prabhas Sreenu)కు, సీనియర్ నటి తులసి(Tulasi)కి ఏదో రిలేషన్ ఉందంటూ రచ్చ రచ్చ చేశారు. దీనిపై తాజాగా ప్రభాస్ శ్రీను స్పందించాడు. తాను ఆమెతో ఒకటి రెండు సినిమాలు మినహా చేసింది లేదన్నారు.

‘డార్లింగ్’(Darling) మూవీలో తులసితో కలిసి నటించినట్టు ప్రభాస్ శ్రీను(Prabhas Sreenu) వెల్లడించాడు. అయితే షూటింగ్ సమయంలో ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకున్నామని తెలిపాడు. ఆమె సీనియర్ నటి అని.. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసి.. ఈ స్థాయికి వచ్చారని తెలిపాడు. ఆ మధ్య ఓ సందర్భంలో ఆమె తనను చనువుగా డార్లింగ్ అని పిలిచారని… దానికే తామిద్దరి మధ్య ఏదో ఉందనేలా అర్థం చేసుకుని తప్పుతప్పుగా రాసేస్తున్నారన్నారు.

Actress Tulasi

తులసి(Tualasi) తనకు తల్లివంటిదని ప్రభాస్ శ్రీను(Prabhas Sreenu) తేల్చి చెప్పాడు. అయితే ఈ రూమర్స్‌ విన్న తర్వాత తులసి తనకు ఒక మెసేజ్ పెట్టారని తెలిపాడు. అలాంటి చెత్త వార్తలు చూసి తన భార్య అపార్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి తనకు అర్థం అయ్యేలా విషయాన్ని వివరించాలని తులసి(Tulasi) తనకు పెట్టిన మెసేజ్‌లో సూచించారని తెలిపాడు. తన భార్య డాక్టర్ అని.. పైగా తమది ప్రేమ వివాహమని.. తనసలు ఇలాంటి వార్తలను నమ్మదని తెలిపాడు. తల్లితో సమానమైన వ్యక్తితో తనకు అఫైర్స్ అంటగట్టడం ఆపాలని ప్రభాస్ శ్రీను(Prabhas Sreenu) కోరాడు.

Google News