Upasana Konidela: పుట్టిబోయే బిడ్డ కోసం ఉపాసన కీలక నిర్ణయం.. అదేంటో తెలిస్తే..

Upasana Konidela: పుట్టిబోయే బిడ్డ కోసం ఉపాసన కీలక నిర్ణయం.. అదేంటో తెలిస్తే..

ప్రతి ఒక్క మహిళ గర్భం దాల్చినప్పటి నుంచే పుట్టబోయే బిడ్డ కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. పుట్టిన తర్వాత కూడా ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా చూసుకుంటుంది. దీనికి సెలబ్రిటీలేమీ తీసిపోరు. అయితే సెలబ్రిటీలు ఆర్థికంగా కూడా పర్ఫెక్ట్‌గా ఉంటారు కాబట్టి వారు తమ బిడ్డ విషయంలో ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడరు. ప్రస్తుతం మెగా కోడలు ఉపాసన అదే చేస్తున్నారు. 

తనకు పుట్టబోయే బిడ్డ కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) భార్య ఉపాసన(Upasana) కీలక నిర్ణయం తీసుకున్నారు. నిజానికి సామాన్యులకు ఇలాంటి నిర్ణయం తీసుకునే ఆలోచన కూడా రాకపోవచ్చు. వచ్చినా కూడా అంత డబ్బు వెచ్చించడం కష్టం. అపోలో ఆసుపత్రుల అధినేత కూతురైన ఉపాసనకు ఇది చాలా చిన్న విషయం. తనకు పుట్టబోయే చిన్నారికి భవిష్యత్తులో వచ్చే అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు తొలగించేందుకు ఉపాసన ఓ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

బిడ్డ పుట్టినప్పుడు మాయ, బొడ్డులో మిగిలి ఉన్న రక్తాన్ని సేకరించి భద్రపరుస్తారు. దీన్ని కార్డు బ్లడ్ ప్రిజర్వేషన్ అంటారు. తన బిడ్డ సంరక్షణ కోసం ఈ కార్డు బ్లడ్ ప్రిజర్వేషన్ పద్ధతిని ఉపాసన అనుసరించనున్నారట. స్టెమ్ సైట్ ఇండియా అనే సంస్థ ఈ సర్వీస్ అందిస్తుంది. తన బిడ్డ కార్డు బ్లడ్‌ని ప్రిజర్వ్ చేయనున్నట్లు ఉపాసన స్వయంగా వెల్లడించారు. భవిష్యత్తులో తన బిడ్డకు ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా కూడా సమర్థంగా ఎదుర్కొనేందుకు ఉపాసన(Upasana Konidela) ఈ నిర్ణయం తీసుకున్నారు.