Bhavanth Kesari: బాలయ్య కెరీర్‌లోనే హయ్యస్ట్ ధరకు ‘భగవంత్ కేసరి’ ఓటీటీ రైట్స్.. ఎంతంటే..

బాలయ్య కెరీర్‌లోనే హయ్యస్ట్ ధరకు ‘భగవంత్ కేసరి’ ఓటీటీ రైట్స్.. ఎంతంటే..

అఖండ(Akhanda), వీరసింహారెడ్డి(Veera Simha Reddy) సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) మాంచి ఊపుమీదున్నారు. ప్రస్తుతం బాలయ్య ‘భగవంత్ కేసరి’(Bhaganth Kesari) అనే పవర్ ఫుల్ టైటిల్‌తో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటి వరకూ బాలయ్యను సీరియస్ యాంగిల్‌లోనే ఎక్కువగా చూశాం. ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి ఎలా చూపించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

ఇక ఈ చిత్రంలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) హీరోయిన్ గా నటిస్తోంది. మరో కీలక పాత్రలో శ్రీలీల(Sreeleela) నటిస్తోంది.  ఇక ఈ సినిమా గురించి ఇప్పటి వరకూ వచ్చిన అప్‌డేట్స్ అన్నీ కూడా సినిమా సూపర్ హిట్ కాబోతోందన్న టాకే ఇచ్చాయి. ఇక తాజాగా మరో అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయట. బాలయ్య కెరీర్‌లోనే ఇది హయ్యస్ట్ డీల్ అని టాక్ నడుస్తోంది. 

Bhagavanth Kesari OTT Rights

బాలయ్య(Balakrishna) కెరీర్‌లో రూ.18 కోట్లకు పైగా ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయిన మొట్టమొదటి సినిమా భగవంత్ కేసరియే కావడం గమనార్హం. గతంలో ‘వీర సింహా రెడ్డి’ చిత్రాన్ని డిస్నీ + హాట్ స్టార్ సంస్థ 15 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందట. ఈ సినిమా హాట్ స్టార్‌కు బాగా కలిసొచ్చింది. దీంతో ‘భగవంత్ కేసరి’(Bhavanth Kesari) విషయంలోనూ వెనుకాడలేదట. రూ.18 కోట్లకు కొనుగోలు పూర్తైందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. సినిమా విడుదలైన నాలుగు వారాలకు ఓటీటీలో విడుదల చేసే ఒప్పందంపై డీల్ పూర్తైందట.

ఇవీ చదవండి:

అదిరిపోలా…బాలయ్యతో బాలీవుడ్ భామ..!

ఎన్టీఆర్‌పై రాళ్లు.. రామ్ చరణ్‌పై ప్రశంసలు కురిపిస్తున్న బాలయ్య ఫ్యాన్స్

ఎన్టీఆర్ వారసుడైన బాలకృష్ణ ఫోటో ఎందుకు పెట్టలేదు?

బాలయ్యను ఈ రేంజ్‌లో తీర్చిదిద్దిన చిన్నమ్మకు హ్యాట్సాప్.. ఎవరామె..!?

Google News